టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఎంటర్టైనర్‌గా, డేరింగ్ అండ్ డాషింగ్ స్టైల్‌తో సినిమాలు తీసి ప్రేక్షకులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన కెరీర్‌లో అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి, ఎంతో మందిని స్టార్ హీరోలుగా మార్చారు. అయితే సినిమాల విషయం పక్కన పెడితే .. కొంత కాలంగా ఆయనకు నిర్మాత-నటి ఛార్మీ కౌర్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చాలా సార్లు స్పందించినప్పటికి పుకార్లు మాత్రం ఆగడం లేదు. అయితే ఇటీవల పూరీ జగన్నాథ్ మరోసారి స్పందిస్తూ తనదైన స్టైల్‌లో క్లారిటీ ఇచ్చారు..
Also Read : Smriti Irani – Deepika : నిర్మాతల గురించి కూడా ఆలోచించాలి.. దీపిక పై స్మృతి ఇరానీ షాకింగ్ కామెంట్స్
“ఛార్మీ నాకు 13 ఏళ్ల వయసు నుంచి తెలుసు. గత 20 సంవత్సరాలుగా మా మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాల్లో పనిచేశాం. కానీ మా మధ్య ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కేవలం యువత కారణంగా వస్తున్నాయి. ఛార్మీకి ఇంకా పెళ్లి కాలేదు, అందుకే ఈ పుకార్లు మరింత భలంగా వస్తున్నాయి. ఆమె 50 ఏళ్ల వయసులో ఉండి, మరో వ్యక్తితో పెళ్లి అయినా, ఆ విషయం పెద్దగా చర్చించేవారు కాదు. తను సింగిల్ కనుకనే ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయి. కానీ మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే, అది శాశ్వతం’ అని పూరి స్పష్టం చేశారు. మొత్తానికి పూరి మరోసారి ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టాడు.
