Raj Kumar Family Relative spandana vijay raghavendra died: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. శాండల్‌వుడ్ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన అనూహ్య పరిస్థితుల్లో కన్నుమూశారు. స్పందన బ్యాంకాక్ పర్యటనలో ఉండగా గుండెపోటుకు గురవడంతో అక్కడే ఆమె మరణించింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి పయనమయ్యారు. స్పందనకు గుండెపోటు వచ్చి మరణించడంతో ఆమె భౌతికకాయం మంగళవారం బెంగళూరుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు గుండెపోటు రావడంతో వచ్చిన వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అంతలోనే ఆమె చనిపోయారు. మంగళవారం (ఆగస్టు 8) ఆమె భౌతిక కాయాన్ని బెంగళూరుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్పందన తండ్రి బీకే శివరామ్, సోదరుడు రక్షిత్ శివరావు ఇప్పటికే బ్యాంకాక్ వెళ్లిపోయారు. స్పందన తండ్రి బికె శివరామ్ ఒక రిటైర్డ్ పోలీసు అధికారి.
Pushpa Shoot: పుష్పరాజ్ ఆన్ డ్యూటీ.. ఈసారి అస్సలు తగ్గేదేలే
స్పందన & విజయ్ వివాహం
విజయ్ రాఘవేంద్ర -స్పందన 26 ఆగస్టు 2007న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. ఈ కుటుంబంలో, స్పందన మరణం ఒక పిడుగులా వచ్చి పడింది. సినీ రంగ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు తమ సంతాపం తెలుపుతున్నారు.
రాజ్ కుమార్ కుటుంబంతో బంధుత్వం
స్వతహాగా నటి కాకపోయినా స్పందన కూడా ఓ సినిమాలో నటించింది. రవిచంద్రన్ తో పాటు విజయ్ రాఘవేంద్ర నటించిన ‘అపూర్వ’లో స్పందన కూడా అతిథి పాత్రలో నటించింది. ఆ సినిమాలో వీరు జంటగా కనిపించారు. అలాగే విజయ్ రాఘవేంద్ర నటించి, దర్శకత్వం వహించిన ‘కిస్మత్’ చిత్రాన్ని కూడా స్పందన నిర్మించింది. స్పందన సోదరుడు రక్షిత్ శివరామ్ కర్ణాటక 2023 విధాన సభ ఎన్నికల్లో బెల్తంగడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. స్పందన తన సోదరుడి తరపున హోరాహోరీగా ప్రచారం చేసింది. నిజానికి కన్నడ నాట ప్రజలు జేజేలు కొట్టే డా.రాజ్ కుమార్ కుటుంబానికి చెందినదే స్పందన కూడా. కన్నడ కంఠీరవ డా.రాజ్ కుమార్ భార్య పార్వతమ్మ రాజ్‌కుమార్ సోదరుడయిన ఎస్‌ఏ చిన్నేగౌడకి స్పందన కోడలు వరుస అవుతుంది. ఇక ఆమె గుండెపోటుతో మృతి చెందడం దురదృష్టకరం అని రాజ్ కుమార్ కుటుంబ అభిమానులు సైతం కామెంట్ చేస్తున్నారు.
