Site icon NTV Telugu

“పుష్ప” ఫస్ట్ రివ్యూ అవుట్… ఎలా ఉందంటే ?

Pushpa

Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప”. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం అల్లు అర్జున్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. యూఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్న ఉమైర్ సంధు ఈ చిత్రాన్ని చూసిన అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. సినిమా ఫస్ట్ రివ్యూని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Read Also : 100 మిలియన్ క్లబ్‌లో ‘భీమ్లా నాయక్’.. పవన్ క్రేజ్ అంటే ఇదే

సెన్సార్ బోర్డ్‌లో సినిమా ప్రదర్శన పూర్తయిందని, “పుష్ప మొదటి సగం రేసీ టెర్రిఫిక్… అల్లు అర్జున్, రష్మిక కెమిస్ట్రీ ఎలెక్ట్రిఫయింగ్… వాట్ ఎ పెర్ఫార్మెన్స్. ఆమె అద్భుతంగా ఉంది. పవర్ ప్యాక్డ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సుకుమార్ డైరెక్షన్ అద్భుతం… టాలీవుడ్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ & నేషనల్ అవార్డ్ వర్తీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన అన్ని విధాలుగా సినిమాను ప్రత్యేకంగా నిలిచారు” అంటూ సినిమాకు రేటింగ్ 4/5 కూడా ఇచ్చేశారు.

అల్లు అర్జున్ అభిమానులు “పుష్ప : ది రైజ్ – పార్ట్ 1” కోసం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాట్ స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్‌లకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. ముఖ్యంగా హిందీ వెర్షన్. ఇక “పుష్ప : ది రైజ్ – పార్ట్ 1″లో ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ఆయనకు తెలుగులో ఫస్ట్ మూవీ.

Exit mobile version