Site icon NTV Telugu

Ester Noronha: అగ్రస్థానంలో ఎస్తేర్ ‘ఐరావతం’

Iravath

Iravath

Ester Noronha: నటి ఎస్తేర్ నొరోహా ఇటీవల కాలంలో బోల్డ్ క్యారెక్టర్స్ తో కుర్రకారును కిర్రెక్కించింది. కానీ అందుకు పూర్తి భిన్నమైన పాత్రను ‘ఐరావతం’ మూవీలో చేసి మెప్పించింది. ఆమె కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో బుల్లితెర నటుడు అమర్ దీప్ చౌదరి, అరుణ్‌ ప్రధాన పాత్రలు పోషించగా, హీరోయిన్ తన్వీ నేగి ద్విపాత్రాభినయం చేసింది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. గుణశేఖర్ శిష్యుడైన సుహాస్ మీరా దీన్ని డైరెక్ట్ చేశారు. నూజివీడు టాకీస్ బ్యానర్ పై రేఖ పలగాని సమర్పణలో బాలయ్య చౌదరి, లలిత కుమారి తోట ఈ సినిమాను నిర్మించారు.

ఒక తెల్లటి కెమెరా చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ‘ఐరావతం’ మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ట్రిక్కీ స్క్రీన్ ప్లే తో సాగే ఈ గమ్మత్తైన కథ మూవీ చివరి వరకు యంగేజ్ చేయడమే ఈ విజయానికి కారణమని దర్శకుడు సుహాస్ మీరా చెబుతున్నారు. దానికి తోడు నేపథ్య సంగీతమూ ఈ సినిమాలోని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ” సుహాస్ మాకు ఆటవిడుపుగా ‘ఐరావతం’ కథ చెప్పాడు. ఈ స్క్రీన్ ప్లే స్ట్రాటజీ నచ్చి మూవీ తీద్దామని అనుకున్నాం. ఇప్పుడీ మూవీని హాట్ స్టార్ వాళ్ళు నచ్చి తీసుకోవడం, తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం, ఇప్పుడు రెండు వారాలుగా మా మూవీ టాప్ వన్ పొజిషన్ లో ఉండటం ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. కథను నమ్మి ఈ సినిమా తీసినందుకు చాలా హ్యాపీ గా ఉన్నాం” అని అన్నారు.

Exit mobile version