పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి బ్లాక్ బస్టర్ మలయాళ యాక్షన్ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. స్టార్ కంపోజర్ థమన్ ఇప్పటికే రికార్డింగ్ పూర్తి చేసారు. వారం రోజుల క్రితం పవన్ కు సంబంధించిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది.
Read Also : భర్తతో రొమాన్స్ కి దీపిక ‘నో’! రెమ్యూనరేషనే కారణం…
“భీమ్లా నాయక్”గా పవన్ ను పరిచయం చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పిక్స్ తో పాటు ఓ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేసింది. దీంతో అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా బజ్ ప్రకారం చిత్ర బృందం సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ను పవన్ పుట్టినరోజున లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.