PS 2 Trailer: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. కల్కి రాసిన ఈ కథను.. మణిరత్నం ఎంతో రీసెర్చ్ చేసి.. ఎంతో భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కించాడు. భారీ తారాగణంతో ఎక్కడా తగ్గకుండా బాహుబలి రేంజ్ లో తీశాడు. గతేడాది ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ అయ్యింది. టాక్ సంగతి పక్కనపెడితే.. కలక్షన్స్ మాత్రం రికార్డులను అందుకున్నాయి. తెలుగువారు సైతం ఈ చిత్రాన్ని ఆదరించారు. ఇక ఈ సినిమా పార్ట్ 2 రిలీజ్ కు సిద్దమయ్యింది. ఏప్రిల్ 28 న అన్ని భాషల్లో PS 2 రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. నేడు ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. లోక నాయకుడు కమల్ హాసన్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Ramya: నటి అరాచకం.. హీరోతో ఎఫైర్.. భర్త గొంతును బ్లేడుతో కోసి
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మొదటి భాగం చూసిన వారికి అయితే ఈ రెండో భాగం ట్రైలర్ కొద్దికొద్దిగా అర్థమవుతుందని చెప్పొచ్చు. పార్ట్ 1 చివర్లో.. చోళ యువరాజు.. అరుళ్ మోళి సముద్రంలో మునిగి చనిపోతాడు అని చూపించారు. ఇక అతను చనిపోయాడు అనుకున్న చాలా రాజులూ అందరూ.. అరుళ్ మోళి పపెద్దమ్మ కొడుకు అయిన మధురాంతకుడును రాజుగా చేయడానికి ప్రయత్నాలు సాగిస్తారు. అయితే అతడిని మరో ఐశ్వర్యరాయ్ కాపాడి బతికిస్తుంది. ఇంకోపక్క తమ్ముడు చనిపోయిన బాధలో ఉన్న కరికాలుడును నందిని ప్లాన్ వేసి చంపాలని ట్రై చేస్తూ ఉంటుంది. నిత్యం చోళ రాజుకు తోడుగా ఉండే వల్లవరాయుడు సైతం వారి కుట్రలో ఇరుక్కుపోయి జైలు పాలు కావాల్సి వస్తుంది. ఇక తన అన్నాను కాపాడిన ఆ నందిని ఎవరో తెలుసుకోవడానికి చోళ యువరాణి కుంధవి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ చోళరాజులను అంతం చేయడానికి నందిని వేసిన ప్లాన్ ఏంటి..? కరికాలుడును ఆమె హతమారుస్తుందా..? చోళ యువరాజు.. తన రాజ్యాన్నీ చేజిక్కించుకున్నాడా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ట్రైలర్ కు ఏఆర్ రెహమాన్ సంగీతం హైలైట్ గా నిలిచింది. పోరాటాలు, రాజులు, కుట్రలు.. తెలుగువారికి బాహుబలిని గుర్తుచేస్తున్నాయి. మొదటి పార్ట్ తో పోల్చుకుంటే రెండో పార్ట్ కాస్తా ఆసక్తికరంగా ఉండనుందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మరి ఈసారైనా ఈ సినిమా ఎలాంటి నెగెటివ్ టాక్ లేకుండా విజయం అందుకుంటుందో లేదో చూడాలి.
https://www.youtube.com/watch?v=z92dXAqFPmE
