Prudhvi Raj Strong Counter to Ambati Rambabu: పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్‌ను అనుకరిస్తూ సీన్లు ఉండడం చర్చనీయాంశం అయిన క్రమంలో కౌంటర్ అటాక్‌కు దిగారు మంత్రి అంబటి రాంబాబు.. బ్రో సినిమా నేను చూడలేదు.. కానీ, బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కల్యాణ్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.. ఎవరో డబ్బులు పెట్టి తీసిన సినిమాలో తాను నటిస్తూ, నా క్యారెక్టర్ పెట్టి ఆనంద పడుతున్నాడు కానీ, నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని, ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్ వేయను, పవన్ కళ్యాణ్ ది శునకానందం అని కామెంట్ చేశారు. ఈ క్రమంలో సినిమాలో అంబటిని అనుకరించిన ప్రముఖ కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఘాటుగా స్పందించారు.
Baby: బేబీ కోసం కదిలొస్తున్న మెగాస్టార్!
అంబటిని అనుకరించాల్సిన అవసరం తనకు లేదన్న ఆయన అంబటి ఏమన్నా ఆస్కార్ స్థాయి నటుడా అని ఎద్దేవా చేశారు. బ్రో సినిమాలో తనది బాధ్యతారహితమైన పాత్ర అని, పబ్బుల్లో అమ్మాయిలతో చిందులేసే పాత్ర అని దర్శకుడు కోరిన మేర తాను ఆ పాత్ర చేశానని అంన్నారు. దర్శకుడు బ్రో సినిమాలో చిన్న పాత్ర ఉంటుంది, రెండు రోజులు కాల్షీట్స్ కావాలని అడిగితే అలా చేసిన పాత్రే తప్పా, ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదని అన్నారు. పవన్ కల్యాణ్ ఎలాంటివారో మీకు తెలియదని పేర్కొన్న పృథ్వి ఆయనది ఎవరినో కించపరుస్తూ సినిమాలో చూపించేంత నీచ స్వభావం కాదన్నారు. సినిమాలోని డ్యాన్స్ కేవలం వినోదం కోసమే అని వైసీపీ వారు దాన్ని మరోలా అర్థం చేసుకుంటే చేసేది ఏమీ లేదన్న ఆయన పవన్ ను వైసీపీ నేతలు ఎంత దారుణంగా అవమానించారో అందరికీ తెలుసు మరి దాన్ని ఏమనాలి అని ప్రశ్నించారు. ఇక అదే సమయంలో అంబటి రాంబాబుపై తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అవకాశం ఇస్తే సత్తెనపల్లిలో కచ్చితంగా చిత్తుగా ఓడిస్తానని పృథ్వీ ధీమా వ్యక్తం చేశారు.