సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం “”ఎతర్క్కుం తునింధవన్””. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నటుడు సూర్యతో ప్రియాంక అరుల్ మోహన్ రొమాన్స్ చేస్తుండగా, ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
Read Also : Rana : నువ్వు చేస్తోంది యాక్టింగా… 4 గంటలు క్లాస్ పీకాడు సూర్య
ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు రానా, సురేష్ బాబు, బోయపాటి శ్రీను తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ చిత్రబృందాన్ని విష్ చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య అభిమానులు “సింగం-4” ఎప్పుడు ? అని ప్రశ్నించారు. స్పందించిన సురేష్ బాబు “సింగం-4 మేము తీయాలనుకోవడం కాదు… హీరో ఒప్పుకుంటే మేము కథ రాసి, నిర్మిస్తాము. అప్పుడు సింగం-4 మాత్రమే కాదు సింగం- 5,6,7 కూడా వస్తాయి” అంటూ క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి సూర్య అభిమానులు “సింగం” సిరీస్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పొచ్చు. మరి “సింగం-4” ఎప్పుడు తెరకెక్కుతుందో !?