Producer SKN registered the title “Cult Bomma”: టాక్సీ వాలా సినిమాతో నిర్మాతగా మారిన ఎస్కేఎన్ బేబీ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన “కల్ట్ బొమ్మ” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఈ మధ్యనే బేబి సినిమాతో టాలీవుడ్ కి కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన ఇంట్రెస్టింగ్ లైనప్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా నిర్మించబోతున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కల్ట్ బొమ్మ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించడం హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి ఎస్కేఎన్ ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు, వాటిలో రష్మిక మందన్న తెరకెక్కుతున్న లీడ్ రోల్ మూవీకి ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ అనౌన్స్ చేశారు.
Bhatti Vikramarka: ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం..
అది కాకుండా సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా ఓ సినిమా, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా మరో సినిమా ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే తాజాగా రిజిస్టర్ చేసిన ఈ కల్ట్ బొమ్మ అనే టైటిల్ ఏ సినిమాకు పెట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాలకు ఆ టైటిల్ పెడతారా? లేక ఈ రెండు కాకుండా కల్ట్ బొమ్మ అనే టైటిల్ తో మరేదైనా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. నిజానికి బేబి సినిమా ప్రమోషన్స్ లో , రిలీజ్ అయ్యాక కూడా కల్ట్ బ్లాక్ బస్టర్, కల్ట్ బొమ్మ అనే పదాన్ని తన స్పీచుల్లో ఎస్ కే ఎన్ బాగా వాడి, ఆ పదాలను పాపులర్ చేశారు. ఈసారి అదే టైటిల్ తో సినిమా రిజిస్టర్ చేయడం చేస్తుండటం చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది.