NTV Telugu Site icon

Baahubali-1 : బాహుబలి-1 రీ రిలీజ్.. బాక్సాఫీస్ బద్దలే

Baahubali 1

Baahubali 1

Baahubali-1 : డార్లింగ్ ఫ్యాన్స్ కు మెంటలెక్కిపోయే న్యూస్ ఇది. బాహుబలి-1 రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ నడుమ రీ రిలీజ్ లకు పెద్దగా ఆదరణ దక్కట్లేదనే వాదన వినిపించింది. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఆ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. పైగా మొన్న సలార్-1 రీ రిలీజ్ కు అడ్వాన్స్ బుకింగ్స్ వారం నుంచే దుమ్ము లేపాయి. ఏడాది కూడా కాకముందే సలార్ కు ఇంత క్రేజ్ ఏంట్రా అని అంతా షాక్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా బాహుబలి-1 రీ రిలీజ్ అయితే ఆ ఊచకోత మాటల్లో చెప్పడం కష్టమే. ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన మూవీ ఇది. జక్కన్న సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన సినిమా. ప్రభాస్ ను ఇండియన్ అగ్ర హీరోగా నిలబెట్టింది.

Read Also : Rithu Chowdary : స్విమ్మింగ్ పూల్ లో రీతూ చౌదరి వయ్యారాలు..

ఇప్పటికీ టీవీల్లో వస్తే కన్నార్పకుండా చూసేస్తారు. అలాంటి సినిమా థియేటర్లలోకి వస్తే ఇంకెలా ఉంటుందో కదా. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పదే పదే అడగ్గా.. ఎట్టకేలకు నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ఈ ఏడాదిలోనే బాహుబలి-1, బాహుబలి-2ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పేశారు. బాహుబలి-1 వచ్చి జులై నాటికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అప్పుడే రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇది గనక రీ రిలీజ్ అయితే ఇప్పటి వరకు ఉన్న పాన్ ఇండియా సినిమా రికార్డులన్నీ బద్దలైపోతాయంటూ కామెంట్లు పెడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.