NTV Telugu Site icon

Guntur Kaaram: ఒక్క స్టిక్కర్ తో అందరి నోర్లకి తాళం వేసాడు… ఇది చాలా ఇంకా కావాలా?

Guntur Kaaram

Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. మే 31న మాస్ స్ట్రైక్ గ్లిమ్ప్స్ తో ఘట్టమనేని అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చారు. మహేష్ బాబుని మాస్ గా చూపించడంలో త్రివిక్రమ్ సూపర్ సక్సస్ అయ్యాడు. 2024 జనవరి రిలీజ్ అవ్వాల్సిన గుంటూరు కారం సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. శహోటింగ్ ఆగిపోయింది, సినిమా ఆగిపోతుంది, కథని మారుస్తున్నారు, థమన్ ని తీసేసారు, మహేష్ అండ్ త్రివిక్రమ్ కి పడట్లేదు, పూజ హెగ్డేని చేంజ్ చేసి ఇంకో హీరోయిన్ ని ఫైనల్ చేసారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు షెడ్యూల్ బ్రేక్ వచ్చిన ప్రతిసారి గుంటూరు కారం సినిమా గురించి సోషల్ మీడియాలో ఎదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి మేకర్స్ కాస్త స్లోగానే గుంటూరు కారం సినిమా పనులు చేస్తున్నట్లు ఉన్నారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన సినిమాకి, దానికి తగ్గట్లు షూటింగ్ ని ప్లాన్ చేసుకుంటారు. అంతేకాని సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహంతో పోస్టులు పెడుతూ గుంటూరు కారం సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్లేస్ లోకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నాడు అనే వార్తలపై థమన్ బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ వేస్తూనే ఉన్నా… రూమర్స్ మాత్రం ఆగట్లేదు. లేటెస్ట్ గా పూజా హెగ్డే ప్లేస్ లోకి ఇంకో హీరోయిన్ వస్తుంది అనే వార్త కూడా వైరల్ అవుతుంది. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. గుంటూరు కారం ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుంది అనే అయోమయం అందరిలో ఉంది. ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టేలా, అందరి నోర్లకి తాళం వేసేలా ఒక్క ట్వీట్ చేసాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ.  “మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తమన్ ని తప్పిస్తున్నారు అనే మాట అవాస్తవం… ఈ నెల 24 నుంచి షూటింగ్.. జనవరి 13న రిలీజ్… ఒకవేళ అదే రోజు ప్రభాస్ ప్రాజెక్ట్ K ఉంటే మాత్రం ఒక రోజు ముందుగానే రిలీజ్…” అని ఒక నెటిజన్ చేసిన ట్వీట్ కి నాగ వంశీ రిప్లై ఇస్తూ థంబ్స్ అప్ స్టికర్ పోస్ట్ చేసాడు. నిజానికి ఇది ఒక చిన్న ట్వీట్ ఏ అయినా నాగ వంశీ చాలా రూమర్స్ చెక్ పెట్టినట్లు అయ్యింది. ఇక్కడితో అయినా గుంటూరు కారం సినిమాపై వినిపించే రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.