Gentleman 2ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ కింగ్ అర్జున్, మధుబాల ప్రధాన పాత్రల్లో నటించిన “జెంటిల్మెన్” మూవీ అప్పట్లో ఓ సంచలనం. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు విశేషమైన ఆదరణ దక్కడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద సైతం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది ఈ మూవీ. 1993లో విడుదలైన ఈ మూవీని నిర్మాత కుంజుమోన్ నిర్మించగా, శంకర్ దర్శకత్వం వహించారు. ఈ ఎవర్ గ్రీన్ మూవీకి సీక్వెల్ ను తెరకెక్కించడానికి నిర్మాత ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2020లో ప్రముఖ నిర్మాత కేటీ కుంజుమోన్ బ్లాక్ బస్టర్ వెంచర్ “జెంటిల్మెన్”కి సీక్వెల్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి ఈ చిత్రంలో కథానాయికలు వీళ్ళే అంటూ పలు రూమర్లు విన్పించాయి.
Read Also : Gentleman 2 : హీరోయిన్ ఫిక్స్… రూమర్లకు చెక్ పెట్టిన నిర్మాత
వాటన్నింటికీ చెక్ పెడుతూ నిర్మాత కుంజుమోన్ కొన్ని రోజుల క్రితం ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోందని అధికారికంగా అనౌన్స్ చేశారు. మరో హీరోయిన్ ను కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పిన నిర్మాత నేడు ఆ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. మరో హీరోయిన్‌గా ప్రియాలాల్ నటించనుందని ఈరోజు వెల్లడించారు. అయితే హీరో ఎవరనే విషయం ఇంకా ఫైనల్ కాకపోవడం గమనార్హం. కాగా ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ను చేపట్టబోతున్న దర్శకుడు ఎవరన్న విషయాన్ని మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. Gentleman 2కు సంబంధించిన మరిన్ని వివరాలలు తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకూ ఎదురు చూడాల్సిందే.
The enthusiastic @PriyaaLal will be the another lead actress in our Mega movie #Gentleman2#ஜென்டில்மேன்2 #जेंटलमेन2 #ജെന്റിൽമാൻ2 #ಜಂಟಲ್ಮನ್2 #జెంటిల్మాన్2@mmkeeravaani #GentlemanFilmInternational
@ajay_64403 @johnsoncinepro @UrsVamsiShekar @PRO_SVenkatesh @Fridaymedia2 pic.twitter.com/3mHPuvQ4jz— K.T.Kunjumon (@KT_Kunjumon) April 13, 2022