Site icon NTV Telugu

Am Ratnam : ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోవడంపై దయాకర్ క్లారిటీ..

Ratnam

Ratnam

Am Ratnam : ఇవాళ ఉదయం నుంచి ఒక న్యూస్ నెట్టింట్ బాగా వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన్ను హాస్పిటల్ లో అడ్మిట్ చేశారని.. హెల్త్ కండీషన్ కొంచెం సీరియస్ గానే ఉందంటూ రూమర్లు రావడంతో తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత, రత్నం తమ్ముడు అయిన దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. ఏఎం రత్నం హెల్త్ కండీషన్ పై వస్తున్న వార్తలు అన్నీ ఫేక్ అంటూ ఖండించారు. ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోయారంటూ వస్తున్న రూమర్లను నమ్మొద్దని చెప్పారు.

Read Also : Rajat Patidar: సంబరాలు చేసుకుందాం, సిద్ధమా.. ఆర్సీబీ అభిమానులకు పాటీదార్ సందేశం!

ఆయన హెల్త్ కండీషన్ బాగానే ఉందని.. కళ్లు తిరిగి పడిపోలేదని తెలిపారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవంటూ స్పష్టం చేశారు. రత్నం హెల్త్ కండీషన్ పై వస్తున్న వార్తలు ఎవరో కావాలనే సృష్టించారని ఫైర్ అయ్యారు రత్నం. వీరమల్లు సినిమా ఐదేళ్ల తర్వాత వస్తుండటంతో.. రిలీజ్ టెన్షన్ తట్టుకోలేక రత్నం పడిపోయారంటూ వార్తలు వచ్చాయి. పవన్ కల్యాణ్‌ మొన్న రాత్రి కంటిన్యూగా నాలుగు గంటల పాటు డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు కీరవాణి ఆధ్వర్యం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. వాటిని ఏఎం రత్నం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also : Radhika Apte : పూరీ-విజయ్ సేతుపతి మూవీలో రాధికా ఆప్టే.. ఇదిగో క్లారిటీ..

Exit mobile version