సోమవారం ఎపి మినిస్టర్ పేర్ని నానితో టాలీవుడ్ సమస్యలపై చిత్రప్రముఖుల భేటీ జరిగింది. అందులో ఫేక్ కలెక్షన్స్ గురించి నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడారు. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ వందల కోట్ల వసూళ్ళు అంటూ పేపర్లలో ఇచ్చే ప్రకటనలు కేవలం ప్రజల్ని మోసం చేయటానికే అని అన్నాడు. మా సినిమా చూడకపోతే మిస్ అవుతామేమో అనే భావన కలిగించటానికే అలాంటి ప్రకటన ఇస్తుంటామని చెప్పారాయన. అది సినిమా అనే కలర్ ఫుల్ మాయ అని మంత్రి పేర్ని నానికి స్పష్టం చేశారు కళ్యాణ్. మంత్రితో సమావేశంలో సి. కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రజల్ని మోసం చేయటానికే ఆ కలెక్షన్స్ ప్రకటన: సి.కళ్యాణ్
