NTV Telugu Site icon

Rajinikanth Next : లీక్డ్ థింగ్స్ వద్దు… క్లారిటీ ఇచ్చిన నిర్మాత

rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమా దర్శకుడిని ఊహిస్తూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవల రజనీకాంత్ సక్సెస్ ఫుల్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌ కుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తారంటూ పుకార్లు స్టార్ట్ అయ్యాయి. ఆ వార్తలపై తాజాగా బోనీ కపూర్ స్పందించారు. ఇలాంటి రూమర్లను నమ్మొద్దని, ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.

Read Also : Kajal Aggarwal baby shower : పిక్స్ వైరల్

“రజనీ గారు చాలా సంవత్సరాలుగా నాకు స్నేహితుడు. మేము తరచుగా కలుసుకుంటాము… ఆలోచనలు పంచుకుంటాము. మేము కలిసి పని చేయడానికి ఒక సినిమాని ఫైనల్ చేశామంటే… దాన్ని ప్రకటించే మొదటి వ్యక్తి నేనే. మీరు పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు” అంటూ సూపర్ స్టార్ కొత్త సినిమాపై వచ్చిన పుకార్లను ఆయన కొట్టిపారేశారు. మరోవైపు అజిత్ తో బోనీ కపూర్ నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాలిమై’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.