Site icon NTV Telugu

హీరోయిన్నీ మోసం చేసిన నిర్మాత.. అరెస్ట్ చేసిన పోలీసులు

kannada producer

kannada producer

సినిమా .. ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరిని నమ్మకూడదు. అలా నమ్మితే మోసపోవడం ఖాయం. ఎంతోమంది మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తారు. తాజగా ఒక నిర్మాత కూడా ఒక నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన శారీరక కోరికలు తీర్చుకొని పెళ్లి అనేసరికి ముఖం చాటేసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక అతడి బెదిరింపులు తట్టుకోలేని ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిర్మాత గుట్టు బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన సినీ నిర్మాత హర్షవర్ధన్.. పలు సినిమాల్లో, సీరియల్లో నటించే ఒక హీరోయిన్ ని పరిచయం చేసుకున్నాడు. ఆమెకు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమె కూడా ప్రేమ, పెళ్లి అనేసరికి అతనిని నమ్మి అతడు ఏం చెప్తే అది చేసింది. కొన్ని నెలలు గడిచాకా పెళ్లి గురించి మాట్లాడితే హర్షవర్ధన్ ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. అంతేకాకూండా పెళ్లి గురించి మాట్లాడితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె వాపోయింది. హర్షవర్ధన్ నుంచి ప్రాణభయం ఉందంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలిసులు రంగంలోకి దిగారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇచ్చిన ఆధారాలపై విచారణ జరిపారు. ప్రాధమిక సమాచారం ప్రకారం.. ఆమెను సదరు నిర్మాత మోసం చేసినట్లుగా గుర్తించి అరెస్టు చేశారు.

Exit mobile version