గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2018 డిసెంబర్‌లో ప్రియాంక, నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ జంట తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సరోగసీ ద్వారా వారు తల్లిదండ్రులు అయ్యినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు..’ అని రాసుకొచ్చింది. దీంతో నిక్- ప్రియంకలకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రియాంక అమెరికాలోని అత్తవారింట్లోనే నివాసముంటుంది. ప్రస్తుతం పలు హాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలలో అమ్మడు కనిపించనుంది.
సీక్రెట్ గా తల్లి అయిన ప్రియాంక చోప్రా..

priyanka