Priyanka Jain Tirumala Youtube Vlog getting negativity with leapord Thumbnail: బుల్లితెర నటి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె బిగ్‌బాస్ సీజన్-7 షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో తనదైన ఆటతీరును కనబరిచి టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచినా విన్నర్ మాత్రం కాలేకపోయింది. అయితే ప్రియాంక బిగ్‌బాస్ ఇంటి నుంచి వచ్చాక ఏ కొత్త సీరియల్స్ ప్రకటించ లేదు, కాస్త రెస్ట్ మోడ్ లో ఉంది. అయితే ఆమె తన ప్రియుడు శివ కుమార్‌తో కలిసి యూట్యూబ్ చానల్‌లో పలు వీడియోలు చేస్తూ నెట్టింట వైరల్ అవుతూ వస్తోంది. తాజాగా, బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చినందుకు తన ప్రియుడితో గొడవలు అయినట్లు ఒక వీడియో పెట్టిన ఆమె తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వార్తల్లోకి ఎక్కింది. దానికి కారణం ఆమె సదరు వీడియోకి పెట్టిన థంబ్ నైల్.
TFJA: హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా TFJA హెల్త్ కార్డ్స్ పంపిణీ
తాజాగా ప్రియాంక జైన్ తన ప్రియుడు శివకుమార్, స్నేహితురాలు హర్షితతో కలిసి తిరుమల వెళ్ళింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సాయంకాలం సమయంలో కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో నడక ప్రారంభించింది. అయితే మధ్యలో ప్రియాంక ఆమె ప్రియుడు శివ ఇద్దరూ చిరుత కనిపించింది అంటూ హడావుడి చేశారు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే అది చిరుత కాదని దూరంగా ఘాట్ రోడ్ లో వెళుతున్న కారు హెడ్ లైట్స్ చిరుత కళ్లలాగా కనిపిస్తూ ఉండడంతో చిరుత వచ్చిందేమోనని కంగారు పడ్డాం అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి కొన్నాళ్ల క్రితం తిరుమల నడక మార్గంలో ఒక చిన్నారిని చిరుత పొట్టన పెట్టుకుంది. ఈ విషయంలో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఈ నేపథ్యంలో వెళుతున్న ప్రతి యాత్రికుడికి ఒక చేతి కర్ర ఇచ్చి పంపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఇప్పుడు మరోసారి వీళ్ళు తమ వ్యూస్ కోసం చిరుత తమ మీద అటాక్ చేసింది అంటూ థంబ్నెయిల్ పెట్టడంతో కామెంట్లలో ఒక రేంజ్ లో వారిని ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఈ అంశంపై మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.