నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక చోప్రా తన జీవితంలో ఓ సంఘటనను ఇటీవల గుర్తు చేసుకున్నారు. ఆ విషయం వింటే వింతగా అనిపిస్తుంది. ‘అపురూపం’ అనే తెలుగు సినిమాతో వెలుగు చూడవలసిన ప్రియాంక చోప్రా అది విడుదల కాకపోవడంతో వేరే చిత్రంతో తొలిసారి జనం ముందు నిలిచారు. అప్పటి నుంచీ కష్టాన్నే నమ్ముకొని ముందుకు సాగిన ప్రియాంక అనతికాలంలోనే అందరి మన్ననలు పొందారు. నేడు హాలీవుడ్ లోనూ పేరు సంపాదించారామె. అమెరికాలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో అక్కడి వాతావరణానికి అలవాటు పడలేదని ఎంతో కంగారుగా ఉండేదని తెలిపారు ప్రియాంక చోప్రా. అప్పట్లో భయం భయంగా ఉంటూ, మధ్యాహ్నం భోజనం కూడా ఒంటరిగా బాత్ రూమ్ లో చేసేదాణ్ణని తెలిపింది. ఈ విషయం విన్నవారందరూ షాక్ కు గురయ్యారు.
Read Also: Priyanka Chopra: బెడ్ సీన్స్ .. ఆ పార్ట్స్ కనిపించకుండా చేతులను అడ్డుపెట్టి
ఒకప్పుడు తనలాంటి వారికి అమెరికా అంటేనే ఎంతో గొప్పగా ఉండేదని, అందులో హాలీవుడ్ అంటే మరింత ఆసక్తిగా ఉండేదని గుర్తు చేసుకున్నారు ప్రియాంక చోప్రా. అందువల్లే హాలీవుడ్ లో అడుగుపెట్టగానే కంగారు ఎక్కువయిందనీ అన్నారామె. అందువల్లే ఎవరితోనూ కలవలేక పోయానని, ఒంటరిగా బాత్ రూమ్ లో కూర్చుని లంచ్ చేసిన సందర్భాలను మాత్రం మరచిపోలేనని ప్రియాంక చెప్పగానే చాలామంది ఆశ్చర్యపోయారు. కొందరు మాత్రం “మీరు అలాంటి భావనకు గురయ్యారంటే, హాలీవుడ్ వారి ప్రవర్తన కూడా కారణం కావచ్చు. అందువల్ల మా అమెరికన్ల తరపున మీకు సారీ చెబుతున్నాం” అనీ అన్నారు. దాంతో ప్రియాంక చోప్రా కన్నీళ్ళ పర్యంతమై పోయారట! ఇది సినిమా కథ కాదు నిజం అంటూ మరికొందరికి ప్రియాంక ఈ విషయాన్ని వివరించారట.