Site icon NTV Telugu

Priyanka Chopra: ముఖంపై ఆ రక్తపు మరకలేంటి?

Priyanka Chopra Face Injured

Priyanka Chopra Face Injured

ప్రియాంక చోప్రా.. పరిచయం అక్కర్లేని పేరు. ఈమధ్య కాలంలో ఈ అమ్మడు ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లోకెక్కుతోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక ఫోటోతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆ ఫోటోలో ప్రియాంక ముఖంపై మనం రక్తపు మరకల్ని గమనించవచ్చు. పెదాలు చిట్లిపోయి, ముక్కలో నుంచి రక్తం రావడాన్ని కూడా చూడొచ్చు. ఫేస్‌పై అక్కడక్కడ దద్దర్లు సైతం ఉన్నాయి. ఎవరైనా ఈ ఫోటోని చూసిన వెంటనే.. ప్రియాంకను ఎవరో కొట్టారనో లేదా ఆమెకి ఏదో ప్రమాదం జరిగిందనో అనుకుంటారు. ఆమె అభిమానులు కూడా అదే అనుకున్నారు.

ప్రియాంక చోప్రా ఆ ఫోటో పెట్టడమే ఆలస్యం.. కింద క్యాప్షన్ చదవకుండానే ‘ఏం జరిగింది? ఎందుకు ఫేస్ ఇలా తయారైంది? ఏమైనా ప్రమాదం జరిగిందా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించేశారు. కాసేపయ్యాక క్యాప్షన్ చదివి.. ‘హమ్మయ్యా’ అనుకున్నారు. ఎందుకంటే, ప్రియాంకకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ ఫోటో ఆమె షూటింగ్ సమయంలో తీసుకున్నది. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. షూట్ నుంచి బ్రేక్ లభించడంతో, ఫేస్‌పై వేసుకున్న మేకప్‌తోనే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. కింద ‘పనిలో క్లిష్టమైన రోజు’ అనే క్యాప్షన్ పెట్టింది. ఇదీ.. ఆ ఫోటో వెనకున్న అసలు సంగతి!

Exit mobile version