ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతి సెలబ్రిటీ తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ తమ సినిమాలతో పాటు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌తో కూడా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నారు. అందులో భాగంగా, గ్లోబల్ స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా మరోసారి తన సరికొత్త లుక్‌తో అభిమానుల మనసులు దోచేసింది.
Also Read : Kantara : వాచిపోయిన కాళ్లు, అలసిన శరీరం – కాంతార విజయం వెనుక రిషబ్ శెట్టి గాధ
ఇటీవల జరిగిన దీపావళి సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రియాంక ధరించిన డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిల్వర్-వైట్ కాంబినేషన్‌లో రూపొందిన ట్రెడిషనల్ ఫ్యూజన్ అట్టైర్‌తో ఆమె అందాల ఆరబోత అద్భుతంగా నిలిచింది. చంకీలతో అద్భుతంగా డిజైన్ చేసిన ఫాంట్, సొగసైన కోర్ట్, చున్నీతో లుక్‌ను కవర్ చేస్తూ ఫోటోలకు పోజ్ ఇచ్చిన ప్రియాంక గ్లామర్‌కి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఒక్క రోజులోనే ఈ ఫోటోలు లక్షల్లో లైక్స్, షేర్స్ అందుకుంటున్నాయి.
ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె తెలుగు సినిమా రంగంలో కూడా అడుగుపెట్టింది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ప్రియాంక కు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. 2027 లో ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రియాంక ఈ సినిమాలో కొత్తగా, పవర్‌ఫుల్‌గా కనిపించేందుకు గట్టిగా కష్టపడుతోందట.