టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి ‘భామాకలాపం’ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 11 న ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇక భామాకలాపం గురించి ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ” నేను టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేశాను. సవాల్ విసిరే పాత్రల్లో నటించాను. ఇక తాజాగా ‘భామాకలాపం’ తో మరోసారి సవాల్ విసిరే పాత్రలో నటిస్తున్నాను. అనుపమ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆమెకు తన జీవితం కన్నా పక్కవారి జీవితంపైనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది.
తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రకరకాల వంటలను పరిచయం చేస్తూ ఉంటుంది. నిజ జీవితంలో అనుపమకు నాకు ఎటువంటి పోలికలు లేవు. అనుపమ చాలా అమాయకురాలు.. కానీ ప్రియమణి అమాయకురాలు కాదు. ఆమెకు వంట వచ్చు .. నాకు తినడం తప్ప ఏమి రాదు. ఇక తనలాగా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసే ఉద్దేశం నాకు లేదు.. ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు” అని చెప్పుకొచ్చింది. మరి ఈ సిరీస్ తో అమ్మడు హిట్ ని అందుకుంటుందో లేదో చూడాలి.