Site icon NTV Telugu

Priyamani : బాలీవుడ్‌లో కలర్‌ బైయాస్‌పై ప్రియమణి సంచలన వ్యాఖ్యలు

Priyamani

Priyamani

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియమణి ఒకరు. 2003లో 17 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మరపురాని చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించిన ఆమె, ముఖ్యంగా తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో పెళ్లైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, ద్రోణా, మిత్రుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, చారులత వంటి చిత్రాలతో పేరు తెచ్చుకుంది. ఇటీవల నారప్ప, భామాకలాపం, విరాట పర్వం వంటి చిత్రాల్లో నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ. హిందీలో జవాన్, మైదాన్ వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించింది. త్వరలోనే తమిళ స్టార్ విజయ్ దళపతి నటిస్తున్న జన నాయగన్ సినిమాలో కీలక పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇక పోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియమణి, బాలీవుడ్‌లో కలర్‌ బైయాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

AlsoRead : Spirit : స్పిరిట్‌లో విలన్ కన్ఫర్మ్.. మొత్తానికి క్లూ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా.. !

“కొంతమంది నన్ను కాస్ట్ చేస్తూ .. ‘సౌత్ ఇండియన్ క్యారెక్టర్ ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకున్నాం’ అని చెప్పారు. మేం జెన్యూన్‌గా సౌత్ ఇండియాకు చెందినవాళ్లమే, అనర్గళంగా అన్ని భాషలు మాట్లాడగలం. నార్త్ యాక్ట్రెస్‌లా తెల్లగా ఉండకపోవచ్చు, కానీ అందంగా ఉంటామని ధైర్యంగా చెప్పగలం. చర్మ రంగు ముఖ్యం కాదు, టాలెంట్ ముఖ్యం. ఇంకా ఇప్పటికీ బాలీవుడ్‌లో పాత్రలు ఇస్తూ రంగు, ప్రాంతం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నా‌రు, నటీనటుల నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం లేదు’ అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version