Site icon NTV Telugu

Priyamani: అల్లు అర్జున్ తో రొమాన్స్.. చేసినా ఆశ్చర్యం లేదే.. ?

Priya

Priya

Priyamani: సీనియర్ హీరోయిన్లు ఒకప్పుడు పెళ్లి తరువాత బరువు పెరిగి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చేవారు. కానీ ఇప్పటి సీనియర్ హీరోయిన్లు.. ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. శ్రీయా, కాజల్.. ఇప్పుడు ప్రియమణి కూడా అందులో చేరింది. ఎవరే ఆటగాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె స్టార్ హీరోయిన్లందరి సరసన నటించి మెప్పించింది. పరుత్తివీరన్ సినిమాకు గాను అమ్మడు నేషనల్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఇక ఎన్టీఆర్ సరసన యమదొంగలో ప్రియమణి యాక్టింగ్, డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఆ తరువాత కొద్దిగా బరువు పెరిగిన ప్రియమణి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అంతేకాకుండా డ్యాన్స్ షోలకు జడ్జిగా మారి మరింత ఫేమస్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో కూడా అమ్మడు తన సత్తా చాటింది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో స్టార్ గా మారింది. జవాన్ లో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ చిన్నది భామా కలాపం 2 కాకుండా మరో మూడు సినిమాలు చేస్తుంది.

ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ మధ్య ప్రియమణి చాలా సన్నగా మారింది భామా కలాపం ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ స్కర్ట్ తో కనిపించి అదరగొట్టింది. ఇక ఆమెను చూస్తే .. ఇంకా హీరోయిన్ గా చేసే అవకాశం లేకపోలేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా గతంలో అల్లు అర్జున్ ఒక డ్యాన్స్ షోలో మాట్లాడిన మాటలలను గుర్తుచేస్తున్నారు. బన్నీతో వర్క్ చేయాలనీ నాకు ఒక ఆశ అని ప్రియమణి చెప్పగానే..బన్నీ.. ” ఆశ వదులుకోకు.. నా పక్కన ఖచ్చితంగా చేస్తావ్.. ఇప్పుడు బాగా సన్నబడి హాట్ గా ఉన్నావ్” అని చెప్పుకొచ్చాడు. ఇక ఇదేదో నిజం అయ్యేలానే కనిపిస్తోంది. ముందు ముందు ఈ చిన్నది.. అల్లు అర్జున్ తో రొమాన్స్.. చేసినా ఆశ్చర్యం లేదే.. ? అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version