Site icon NTV Telugu

Priya Bhavani Shankar: నేను ఇండస్ట్రీకి వచ్చింది దాని కోసమే.. ప్రియా సంచలనం

Priya Bhavani On Industry

Priya Bhavani On Industry

Priya Bhavani Shankar Reveals Why She Came In Film Industry: సినీ పరిశ్రమకు ఎందుకు వచ్చారని అడిగితే.. ఎవరైనా ప్యాషన్ కోసమని చెప్తారు. నటులుగా తమ ట్యాలెంట్ నిరూపించుకోవాలని, తమదైన ముద్ర వేయాలన్న ఆకాంక్షతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టామని చెప్తారు. సినిమాల్లో నటించాలన్నదే తమ డ్రీమ్‌గా పేర్కొంటారు. కానీ.. ప్రియా భవానీ శంకర్ మాత్రం అందరికంటే భిన్నంగా, తాను డబ్బు కోసమే ఈ ఫీల్డ్‌లోకి వచ్చానని కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పింది. నటించడానికి వచ్చినప్పుడు తనకు భవిష్యత్ గురించి ఎలాంటి ఆలోచనలు లేవ.. ప్రేక్షకులు తనని ఆదరిస్తారా, లేదా అని ఎన్నడూ భయపడలేదని పేర్కొంది. నటిస్తే డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతోనే తాను నటించడానికి వచ్చానని బాంబ్ పేల్చింది.

Lovers Statue Marriage: బొమ్మలకు పెళ్లి.. నేటి తరం లైలా-మజ్నుల కథ

అయితే.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నాళ్ల తర్వాత తనకు పరిస్థితి అర్థమైందని ప్రియా భవాని తెలిపింది. సినీ నేపథ్యం కలిగిన వారే తామేంటో నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతున్నారని, దీంతో తాను కూడా ఇంకా ఎక్కువగా శ్రమించాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. సినీ పరిశ్రమలో రాణించడం అంత సులువు కాదని తెలుసుకున్నానని, తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడతానని చెప్పుకొచ్చింది. తనకు తెలుగులోనూ ఈమధ్య మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. కాగా.. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన ప్రియా భవానీ, మేయాదమానే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఎస్‌జే.సూర్య సరసన మాన్‌స్టర్, కార్తీకి జంటగా కడైకుట్టి సింగం, అరుణ్‌విజయ్‌తో మాఫియా, ధనుష్‌తో తిరుచ్చిట్రంఫలం వంటి చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Girls In Burqa: బురఖా ధరించి వచ్చిన విద్యార్థినులకు నో ఎంట్రీ.. కాలేజీలో ఉద్రిక్తత

ప్రస్తుతం రుద్రన్, డిమాంటీ కాలనీ- 2, ఇండియన్‌-2 చిత్రాల్లో నటిస్తున్న ప్రియా.. ‘‘కల్యాణం కమనీయం’’ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదల అయ్యింది. మరో తెలుగు సినిమా కూడా చేస్తోంది. చూస్తుంటే.. ఈ అమ్మడు తెలుగులో కూడా బిజీ నటిగా మారిపోయేలా కనిపిస్తోంది.

Vladimir Putin: సందేహమే లేదు.. ఉక్రెయిన్‌పై గెలిచి తీరుతామన్న పుతిన్

Exit mobile version