Site icon NTV Telugu

NTR 31: NTRNeel టైటిల్ కన్ఫామ్ చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

Ntrneel

Ntrneel

కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నసంగతి తెలిసిందే. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బాదం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. రవి  బస్రూర్ సంగీత భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.

Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సిరీస్ లు ఇవే

కాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ అనేక పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ నీల్ సినిమా టైటిల్ ను మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ రివీల్ చేసారు. ఓ మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్ అలాగే యంగ్ హీరో తోవినో థామస్ నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డ్రాగన్ లో ఆ ఇద్దరి మలయాళ నటులకు ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఒక మంచి నటులుగా ప్రశాంత్ వారికి తగిన ఇంపార్టెన్స్ ఇస్తాడని అనుకుంటున్నాను, డ్రాగన్ సినిమా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటుంది’ అని అన్నాడు. అలా ఎన్టీఆర్ – నీల్ సినిమా టైటిల్ ను రివీల్ చేసాడు. ఇప్పటివరకు రూమర్ గానే ఉన్న టైటిల్ ను పృద్వి రాజ్ సుకుమారన్ కన్ఫామ్ చేసేసాడు. ఇక వార్ 2 ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ షూట్ కు విరామం ఇచ్చాడు. వార్ 2 ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Exit mobile version