Site icon NTV Telugu

Sitaare Zameen Par : అమీర్ ఖాన్ మూవీ చూసిన రాష్ట్రపతి

Sitare Jamin Per

Sitare Jamin Per

Sitaare Zameen Par : అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్. మంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ సినిమా. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు దీనిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూవీని చూశారు. రాష్ట్రపతి భవన్ లో మూవీ కోసం స్పెషల్ షో వేశారు. ఇందులో రాష్ట్రపతితో పాటు ఆమె సిబ్బంది, కుటుంబ సభ్యులు, మూవీ టీమ్ అంతా కలిసి చూశారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియాలో పంచుకుంది. రాష్ట్రపతి తమ మూవీని చూడటం చెప్పలేనంత సంతోషంగా ఉందని తెలిపారు.

Read Also : Vijay Anthony : తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పెరిగింది.. హీరో విజయ్ కామెంట్స్..

మూవీ చూసిన రాష్ట్రపతి తమను ప్రశంసించారని.. ఆమె మాటలు తమకెంతో విలువైనవి అంటూ తెలిపింది టీమ్. ఆమె తమ సినిమాను చూడటం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్ గా వచ్చింది సితారే జమీన్ పర్. ఈ సినిమాలో హ్యూమన్ ఎమోషన్స్ ను టచ్ చేశారు. అమీర్ ఖాన్ చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్నారు.

Read Also : Preethi Mukundan : కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

Exit mobile version