Nivin Pauly : 11 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న ప్రేమమ్ కాంబో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2015లో మలయాళ ఇండస్ట్రీనే ఊపేసింది ప్రేమమ్. నివిన్ పౌలీ హీరోగా ఆల్పాన్స్ ఫుత్రేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈసినిమాతోనే సాయి పల్లవి వెండితెరకు పరిచయమయింది. ప్రేమమ్ ను నాలుగు కోట్లతో తీస్తే రూ. 75 కోట్లను వసూలు చేసి ఆశ్చర్యపరచింది. అక్కడ బాక్సాఫీసుపై ఇంపాక్టే కాదు ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు కొత్త అర్థం చెప్పింది మూవీ. నివిన్ పౌలీని కెరీరే తిప్పేసిన సినిమా ప్రేమమ్.
సర్వం మాయ రానంత వరకు అతడి కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది . ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్‌లకు లైఫ్ ఇచ్చింది కూడా ఈ మూవీనే. ఈ సినిమాకు సాయి పల్లవి కొరియోగ్రాఫీ చేయడం విశేషం. తెలుగు ఆడియెన్స్ ప్రేమమ్ నుండే మలయాళ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అవడం మొదలెట్టారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఇంతటి సంచలనాలు సృష్టించిన ప్రేమమ్ రిలీజై 11 ఇయర్స్ కంప్లీట్ కావొస్తున్నాయి. ప్రేమమ్ తర్వాత నివిన్ పౌలీ ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ డైరెక్టర్ వన్ ఆర్ టూ మూవీస్‌కే పరిమితయ్యాడు. దర్శకుడిగా ట్రాక్ తప్పేసిన ఆల్ఫాన్సోను తిరిగి ఫేమ్ తెచ్చేందుకు మరో ఛాన్స్ ఇస్తున్నాడు నివిన్ పౌలీ. తన మైల్ స్టోన్ మూవీ 50వ ప్రాజెక్ట్‌కు ఆల్ఫోన్సోను సెట్ చేశాడు హీరో. జూన్ 27న టైటిల్ రివీల్ చేయనున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మరీ ఈ కాంబో సర్వం మాయ రికార్డ్స్ చెరిపేస్తుందో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Nivin Pauly : 11 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న ప్రేమమ్ కాంబో
-
Virat Kohli Diet: ఒకప్పుడు మాంసాహారి.. ఇప్పుడు కఠిన శాకాహారి.. విరాట్ జీవితాన్ని మార్చింది ఎవరు?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్లకు నోటీసులు!
-
Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..
ట్రెండింగ్
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్‌టెల్‌కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!