కుల వ్యవస్థ నిర్మూలానికి కంకణం కట్టుకున్న భారత ప్రథమ సామాజిక తత్త్వవేత్త, ఉద్యమ కారుడు మహాత్మ జ్యోతిరావ్ పూలే. ఏప్రిల్ 11 సోమవారం ఆయన 195వ జయంతి సందర్భంగా హిందీలో బయోపిక్ ఒకటి రూపుదిద్దుకోబోతున్నట్టు ప్రకటన వచ్చింది. నాటక రంగం నుండి సినిమాల్లోకి వచ్చి ఆ పైన వెబ్ సీరిస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్ గాంధీ… జ్యోతిరావ్ పూలే పాత్రను పోషించబోతున్నారు.
‘ఫులే’ పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ బయోపిక్ లో సావిత్రి బాయి పూలేగా జాతీయ ఉత్తమ నటుడు రాజ్ కుమార్ రావ్ భార్య పత్రలేఖ నటించబోతోంది. అలానే నేషనల్ అవార్డ్ విన్నర్ అనంత్ నారాయణ మహదేవన్ దర్శకత్వం వహించే ఈ సినిమాను డా. రాజ్ కిశోర్ ఖవారే, ప్రణయ్ ఖోస్కీ, సౌరభ్ వర్మ, ఉత్పల్ ఆచార్య, అనుయ చౌహాన్, రితీష్ నిర్మించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాదిలో విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.