Site icon NTV Telugu

Prashanth Varma: హనుమాన్ హిట్ అయితే.. అవతార్ కన్నా పెద్ద ఫిల్మ్ చేస్తా

Varma

Varma

Prashanth Varma: అ! లాంటి సైకలాజికల్ ఫాంటసీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కలక్షన్స్ రాబట్టలేదు కానీ, మంచి గుర్తింపుతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ.. కల్కి, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు తీసి మెప్పించాడు. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగులో తొలి సూపర్ హీరో మూవీగా రూపొందిన హనుమాన్ ఈ సంక్రాంతికి వచ్చేస్తోంది. జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో హనుమాన్ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం వరుస ప్రమోషన్స్ తో బిజీగా మారింది.

ఇక ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాలని హనుమాన్ చిత్రానికి ఒత్తిళ్లు వచ్చినట్టు ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. అయినా కూడా కథ మీద నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు డైరెక్టర్ తెలిపాడు. ఇక ప్రమోషన్స్ హైప్ తీసుకురావడానికి యంగ్ హీరో అడివి శేష్ తో ఇంటర్వ్యూ చేయించారు. ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ సినిమా గురించి మాట్లాడాడు. హనుమాన్ కనుక హిట్ అయితే.. అవతార్ కన్నా పెద్ద ఫిల్మ్ చేస్తా అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేక్షకులు ఆ కాన్ఫిడెన్స్ కే పడిపోవచ్చు భయ్యా.. ఆ టాలెంట్ ఉంది నీలో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి హనుమాన్ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

Exit mobile version