Prashanth Varma: హనుమాన్ హిట్ అయితే.. అవతార్ కన్నా పెద్ద ఫిల్మ్ చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Varma: అ! లాంటి సైకలాజికల్ ఫాంటసీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కలక్షన్స్ రాబట్టలేదు కానీ, మంచి గుర్తింపుతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ.. కల్కి, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు తీసి మెప్పించాడు. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగులో తొలి సూపర్ హీరో మూవీగా రూపొందిన హనుమాన్ ఈ సంక్రాంతికి వచ్చేస్తోంది. జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో హనుమాన్ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం వరుస ప్రమోషన్స్ తో బిజీగా మారింది.
ఇక ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాలని హనుమాన్ చిత్రానికి ఒత్తిళ్లు వచ్చినట్టు ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. అయినా కూడా కథ మీద నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు డైరెక్టర్ తెలిపాడు. ఇక ప్రమోషన్స్ హైప్ తీసుకురావడానికి యంగ్ హీరో అడివి శేష్ తో ఇంటర్వ్యూ చేయించారు. ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ సినిమా గురించి మాట్లాడాడు. హనుమాన్ కనుక హిట్ అయితే.. అవతార్ కన్నా పెద్ద ఫిల్మ్ చేస్తా అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ మాటలు విన్న ప్రేక్షకులు ఆ కాన్ఫిడెన్స్ కే పడిపోవచ్చు భయ్యా.. ఆ టాలెంట్ ఉంది నీలో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి హనుమాన్ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!