Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prashanth Varma Latest Interview

Prasanth Varma: నా సినిమాటిక్ యూనివర్స్ లో బాలకృష్ణతో సినిమా ఉంది..

Published Date :January 11, 2024 , 8:01 pm
By Roja Pantham
Prasanth Varma: నా సినిమాటిక్ యూనివర్స్ లో బాలకృష్ణతో సినిమా ఉంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prasanth Varma: సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

హను-మాన్ పాత్ర కోసం తేజని ఎలా మౌల్డ్ చేశారు ?

తేజ నాకంటే సీనియర్. తనకి యాక్టింగ్ నేర్పించాల్సిన అవసరం లేదు.(నవ్వుతూ) అయితే హనుమాన్ కోసం తేజని మేకోవర్ చేయించాను. జాంబీరెడ్డిలో సిటీ బాయ్ లా కనిపిస్తాడు. ఇందులో పల్లెటూరి కుర్రాడిలా కనిపిస్తాడు. మేకోవర్ సెట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కితిరిగి చూడలేదు. ఈ సినిమా కోసం తేజ చాలా కష్టపడ్డాడు. ఇది పూర్తయ్యే వరకూ మరో సినిమా ఒప్పుకోలేదు. హనుమాన్ పై నాకంటే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాడు తేజ.

ఈ సినిమా తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని అనుకున్నారు కదా.. కానీ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడానికి కారణం?

వీఎఫ్ఎక్స్ గురించి పూర్తిగా తెలుసనుకున్నాను. కానీ సినిమా మొదలుపెట్టిన తర్వాత అందులో సాధకబాధకాలు ఇంకా బాగా అర్ధమయ్యాయి. జాంబీ రెడ్డి 50 షాట్స్ వుంటాయి. ఇందులో 1600 షాట్స్ వున్నాయి. పైగా వీఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళు అనుకున్న సమయానికి వర్క్ ని ఇవ్వలేకపోయారు. ఇంకా సమయం కావాలని కోరారు. ఈ జర్నీలో చాలా నాలెడ్జ్ వచ్చింది. ఇకపై వీఎఫ్ఎక్స్ వున్న సినిమా ఫాస్ట్ గా తీయగలను.

ఎన్టీఆర్ గారు సూపర్ మ్యాన్ అనే సినిమా చేశారు.. ఆ సినిమా పోలికలు ఇందులో ఉన్నాయా ?

హనుమాన్ లో ఎన్టీఆర్ గారి సూపర్ మ్యాన్ కి సంబధించిన హోమయిస్ ప్లే చేశాం. మొదట్లో ఇదే తెలుగులో మొదటి సూపర్ హీరో సినిమాని వేశాం. తర్వాత ఎన్టీఆర్ గారు చేసేశారని తెలిసింది. దానికి తగ్గట్టుగా ఇందులో సూపర్ మ్యాన్ హోమయిస్ చూపించాం.(నవ్వుతూ)

సూపర్ మ్యాన్ సినిమా కథలు దాదాపుగా ఒక టెంప్లెట్ లో వుంటాయి కదా.. హను మాన్ లో వుండే కొత్తదనం ఏమిటి ?

హనుమాన్ సూపర్ హీరో ఫిల్మ్ టెంప్లెట్ లోనే వుంటుంది. కొత్తదనం ఏమిటంటే.. ఇది మన తెలుగు సినిమా స్టయిల్ అఫ్ మేకింగ్ లో వుంటుంది. బ్యాట్ మ్యాన్ లాంటి సినిమాని రాజమౌళి గారు చేస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది. మరోలా చెప్పాలంటే కేజీఎఫ్ లో యష్ ని ఎలా చూపించారో నేను హనుమంతుని అలా చూపించబోతున్నాను.

ఒక సూపర్ హీరో పాత్ర కోసం తేజ సజ్జా లాంటి యంగ్ హీరోని తీసుకోవాలని ఎలా అనిపించింది?

పర్శనల్ గా తేజని అందరూ ఇష్టపడతారు. సినిమాల్లో తనకి ఇంకా మాస్ ఇమేజ్ రాలేదు. ఇందులో పాత్రకు ఇలాంటి నటుడే కావాలి. సినిమా చూస్తున్న ప్రేక్షకులు తనకి సూపర్ పవర్స్ రావాలని అనుకున్నప్పుడు ఆ పవర్స్ వస్తాయి. ఎమోషన్ ప్రేక్షకుల నుంచి రూట్ అవుతుంది కాబట్టి అది చాలా సహజంగా వుంటుంది.

నార్త్ లో ప్రమోషన్స్ చేశారు కదా రెస్పాన్స్ ఎలా వుంది ?

అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వుంది. సౌత్ సినిమాని చాలా గొప్ప స్థాయిలో చూస్తున్నారు. హనుమాన్ సినిమా తీస్తున్నామని చెప్పగానే.. సౌత్ వాళ్ళు గొప్ప తీస్తారని అభినందించారు. చాలా ఆనందంగా అనిపించింది. హనుమాన్ కు అన్నీ వైపుల నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూస్తుంటే… ఇదంతా ఒక డ్రీంలా వుంది. ప్రేక్షకులు చాలా గొప్ప ఆదరణ చూపుతున్నారు.

హనుమాన్ మిగతా పాత్రలు గురించి ?

అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. గెటప్ శ్రీను, సత్య పాత్రలు కూడా వినోదాత్మకంగా వుంటాయి. సముద్రఖని గారు చేస్తున్న పాత్ర చాలా ప్రత్యేకంగా వుంటుంది.

నిర్మాత నిరంజన్ రెడ్డి గారు గురించి ?

నిరంజన్ రెడ్డి గారు చాలా పాజిటివ్ పర్శన్. సినిమాని చాలా గ్రాండ్ గా తీయాలనే అభిరుచి వున్న నిర్మాత. అవసరమైతే స్పానిష్ లో కూడా పాటలు చేయిద్దామని అన్నారు. ఆయనకి పెద్ద సినిమాలు చేయాలనే తపన వుంది.

హను మాన్ లో చాలా మంచి కంటెంట్ కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రమోషనల్ మెటిరియల్ ని చాలా క్రియేటివ్ గా డిజైన్ చేశారు. అయితే ఈ కంటెంట్ గురించి కాకుండా థియేటర్స్ గురించి చర్చ ఎక్కువగా జరగడం ఒక ఫిల్మ్ మేకర్ ఎలా అనిపిస్తోంది?

ఒక ఫిల్మ్ మేకర్ గా నా ద్రుష్టి కంటెంట్ మీదే వుండాలి. క్యాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నామే లేదా అనేదే చూసుకోవాలి. కానీ అనుకోకుండా థియేటర్స్ చర్చ తెరపైకి వచ్చింది. నిజానికి ఇది నిర్మాతలు చూడాల్సిన అంశం. కానీ కొన్నిసార్లు బాధకలిగించే మాటలు విన్నప్పుడు మాట్లాడాల్సి వస్తోంది. అయితే సినిమా విడుదలైన తర్వాత కేవలం కంటెంట్ గురించే మాట్లాడుతారు. హను-మాన్ చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమా విజయం సాధిస్తే.. పదేళ్ళు పాటు మనం గర్వంగా చెప్పుకునే సినిమాలు చేయొచ్చునే ప్రణాళిక వుంది.

నెక్స్ట్ సినిమా గురించి ?

నెక్స్ట్ మూవీ హనుమాన్ రిజల్ట్ ని బట్టి వుంటుంది.

బాలకృష్ణ గారికి కథ చెప్పారని విన్నాం ? అది మీ సినిమాటిక్ యునివర్స్ లో ఉంటుందా ?

బాలకృష్ణ గారికి కథ చెప్పాను. అది యునివర్స్ లో పెట్టోచ్చు, స్టాండ్ ఎలోన్ గా చేయొచ్చు. అది బాలకృష్ణ గారి నిర్ణయం బట్టి వుంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hanuman
  • Prasanth Varma
  • Teja Sajja
  • Tollywood News

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions