Site icon NTV Telugu

Hanuman: హనుమాన్ స్టోరీ లైన్ ఇదే.. లీక్ చేసేసిన ప్రశాంత్ వర్మ

Prashanth Varma

Prashanth Varma

Prashanth Varma clears speculations on Hanuman Movie: ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ పండుగ సీజన్‌లో ఆనందరికంటే ముందు కర్చీఫ్ వేసుకుని థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా మీద చాలా పాజిటివ్ బజ్‌ని సృష్టించగలిగారు మేకర్స్. అయితే ఈ సినిమా కథ ఏమిటీ అనే విషయంలో అనేక ప్రచారాలు ఉన్నాయి. ఈ సినిమా కథ విషయంలో ఇంకా గందరగోళం కొనసాగుతోందని ప్రశాంత్ వర్మ ఇటీవల ఒక ఇంటరాక్షన్‌లో తెలిపారు. ఇది రామాయణంలో భాగమా లేదా తేజ హనుమంతుడా లేదా ఏదో 3డి సినిమానా అని కొన్ని ఊహాగానాలు ఉన్నాయి.

Samantha: సామ్.. కొత్త సంవత్సరం.. ఏంటీ ఈ అరాచకం..?

అందుకే నేను సినిమా చుట్టూ ఉన్న అన్ని ఊహాగానాలను క్లియర్ చేయాలనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తేజ హనుమంతుని యొక్క సూపర్ పవర్స్ పొందిన ఒక సాధారణ వ్యక్తి అని సూపర్ పవర్స్‌తో తేజ తన గ్రామమైన అంజనాద్రిని, ప్రపంచాన్ని దుష్ట బుద్ధి గల విలన్‌ల నుంచి ఎలా కాపాడాడు అనేది కథాంశం అని అన్నారు. ఇలా, నా సూపర్ హీరోల కథలన్నీ దేవుడి అంశలా ఉంటాయని అన్నారు. ఈ సిరీస్‌లో రెండవ సినిమా అధీర, ఇప్పటికే ఆ సినిమా పనిలో ఉన్నామని అన్నారు. ఇక 3వ చిత్రం స్త్రీ పాత్ర చుట్టూనే ఉంటుంది. ఇలా మొత్తం 12 సినిమాలు ప్లాన్ చేయబడ్డాయని ఈ చిత్రాలన్నీ రియాలిటీ కావాలంటే, హనుమాన్ విజయం సాధించడం చాలా కీలకం అని అన్నారు. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version