Prashanth Neel vs Shahrukh Khan : టైటిల్ చూసి ఖంగారు పడకండి, జస్ట్ అలా అనిపించింది అంతే. అసలు విషయం ఏమిటంటే డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ నటించిన డంకీ, 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలు ప్రేక్షకుల ముంచుకు వచ్చాయి. ఒక్క రోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు, అది కూడా దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ల సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం. మాములు సినిమాలే రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ లేకుండా చూసుకుని బరిలో దిగుతుంటే ఎందుకు తగ్గాలి అనుకున్నారో ఏమో కానీ ఇద్దరు స్టార్లు రంగంలోకి దిగారు. ముందుగా ప్రభాస్-షారుఖ్ ఖాన్ లు మాత్రం సైలెంట్ గా వార్ కి రెడీ అవుతున్నారని అనుకుంటే థియేటర్లు బ్లాక్ చేసి దాన్ని మరింత కఠినతరం చేసేశారు. ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు కానీ డంకీ టాక్ షారుఖ్ అభిమానులు సహా నార్త్ ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. సలార్ సినిమా మాత్రం మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మాస్ సినిమా కాబట్టి సలార్ కారణంగా డంకీ మూవీకి ఊహించని లాస్ ఉంటుందని ముందే ప్రచారం జరగ్గా ఇప్పుడు అదే నిజమైంది.
Neru: మోహన్ లాల్ కూడా హిట్ కొట్టాడోచ్!
షారుఖ్ సలార్ సినిమా వస్తున్నా కూడా డంకీ సినిమాని వాయిదా వేయకుండా రిలీజ్ చేయకుండా కాస్త ముందో వెనుకో వచ్చి ఉంటే పోటీ తప్పేది, అన్ని విషయాల్లో కంపారిజన్ తప్పేది. ప్రశాంత్ నీల్ షారుఖ్ తో పోటీ పడి సినిమ రిలీజ్ చేయడం ఇది రెండవ సారి. కాకతాళీయమో, యాదృచ్ఛికమో కానీ KGF 1 సినిమాని షారుఖ్ జీరో మూవీకి పోటీగా రిలీజ్ చేసి, షారుఖ్ ని అయిదేళ్ల పాటు రెస్ట్ మోడ్ లోకి పంపాడు. ఇప్పుడు పఠాన్, జవాన్ అంటూ వరుస హిట్స్ కొట్టిన షారుఖ్ డంకికి పోటీగా మళ్లీ సలార్ ని దించాడు ప్రశాంత్ నీల్. షారుఖ్ పై పగబట్టాడో లేక యాక్సిడెంటల్ గా జరుగుతుందో తేలియదు కానీ ప్రశాంత్ నీల్ అయిదేళ్ల తర్వాత కూడా వెతుక్కుంటూ వెళ్లి మరీ షారుఖ్ సినిమాతో పోటీ పడి దెబ్బ వేయడం గమనార్హం. థియేటర్ల వ్యవహారం వెలుగులోకి రాకుండా ఉంటే ఎలా ఉండేదో కానీ ఇప్పుడు అది బయటకు రావడంతో ఇప్పుడు సౌత్ ఆడియన్స్ అందరూ షారుక్ అండ్ నార్త్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో వేసుకుంటున్నారు.