Prashanth Neel: అవును.. కెజిఎఫ్ లో చేసిన తప్పులే సలార్ లో కూడా చేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Neel: ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత కెజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన డైరెక్టర్ అంటే ప్రశాంత్ నీల్ అనే చెప్పాలి. ఇక కెజిఎఫ్ లాంటిబిగ్గెస్ట్ హిట్ అందుకున్నాకా.. ప్రశాంత్ నీల్ ను టాలీవుడ్ లాగేసింది.. వరుసగా ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. ఒక్కో సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కించాడు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం పార్ట్ 1 డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ సైతం ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్.. కెజిఎఫ్, సలార్ కు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. మొదటి నుంచి కూడా సలార్ చాలా లేట్ అవుతూ వస్తుంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఇన్ ఫుట్ సరిగ్గా రాలేదని మళ్లీ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేశాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కెజిఎఫ్ సమయంలో కొన్ని తప్పులు దొర్లాయి.. అదే సలార్ టైమ్ లో కూడా జరిగినట్లు ప్రశాంత్ చెప్పుకురావడం హైలైట్ గా నిలిచింది. “కేజీఎఫ్‌లో చేసిన తప్పులే సలార్‌లో చేస్తున్నాను. ఆ సమయంలో మేము మొత్తం సినిమాని చూడడానికి.. చూసాక అవసరమైతే కొన్ని విషయాలను మార్చడానికి సమయం లేదు.
మళ్ళీ, సలార్ కు నేను గజిబిజి పరిస్థితిలో ఉన్నాను. కానీ మేము చేసిన దానికి మాత్రం సంతోషంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ తప్పులు ఏంటి.. ? లెంత్ విషయంలోనా.. ? లేక రీషూట్ విషయంలోనా.. ? లేక గ్రాఫిక్స్ విషయంలోనా అనేది క్లారిటీ లేదు. ఏదిఏమైనా ప్రభాస్ సలార్ మాత్రం రికార్డులు బద్దలు కొడుతోంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..