కెజిఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా విజయంతో టాలీవుడ్ లో కెర్స్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక టాలీవుడ్ లో ఈ డైరెక్టర్ తీస్తున్న చిత్రాలలో క్రేజియెస్ట్ కాంబో గా నిలిచింది మాత్రం ఎన్టీఆర్ తోనే అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రశాంత్ నీల్ పాల్గొంటున్నాడు. ఇక తాజాగా ఈ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రశాంత్.. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ” నేను ఎన్టీఆర్ కి 20 ఏళ్లుగా పెద్ద అభిమానిని.. నా సినిమాఆయనకు చెప్పకముందే తారక్ ను 10, 15 సార్లు కలిసి మాట్లాడాను. ఆ తరువాత నేను చెప్పిన కథ నచ్చడంతో తారక్ సినిమాను ఓకే చేశాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. మేము గత రెండేళ్లుగా సన్నిహితులం. ఈ సినిమా చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. దయచేసి అది ఏ జోనర్ అని నన్ను అడగొద్దు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ వ్యాఖ్యలు నేర్త్తింట వైరల్ గా మారాయి. సాధారణంగా ప్రశాంత్ నీల్ తీసేవన్నీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీస్. ఉగ్రం, కెజిఎఫ్ 1, 2, ఇప్పుడు సలార్ కూడా యాక్షన్ సినిమానే కాబట్టి ఎన్టీఆర్ తో కూడా యాక్షన్ సినిమానే తీయనున్నట్లు అభిమానులు అంచనాలు పెట్టుకుంటున్నారు. ఒక వేళ అదే కనుక నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే పండగ. మరి ఆ జోనర్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే . ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
