Salaar: ఇంత సైలెంట్ గా ఎలా షూట్ చేస్తున్నావు నీల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియాలోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతోంది ‘సలార్’. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై ఆకాశాన్ని తాకే అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే ఉన్నాయి. మోస్ట్ వయొలెంట్ మాన్… ఒక మనిషిని మోస్ట్ వయొలెంట్ అన్నారు అతని పేరు సలార్ అంటూ ప్రశాంత్ నీల్ ఈ మూవీపై అంచనాలు పెంచాడు. KGF డైరెక్టర్, బాహుబలి హీరో కలిస్తే బాక్సాఫీస్ లెక్కలు తారుమారు అవ్వడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ రోజున ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులు అన్నీ బ్రేక్ అయ్యి కొత్త చరిత్ర పుట్టేలా ఉంది. ఇంతటి పెద్ద సినిమాని రెండు పార్ట్స్ చేస్తూ ప్రశాంత్ నీల్ నిర్ణయం తీసుకున్నాడు. రెండు పార్ట్స్ లో సలార్ వస్తుంది అనగానే బాహుబలి, KGFల హిస్టరీ ప్రతి ఒక్కరి కళ్లకి కనిపించింది. అంతటి అంచనాలు ఉన్న ఇలాంటి సినిమాని చెయ్యాలి అంటే ఏ డైరెక్టర్ లో అయినా కాస్త టెన్షన్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ మాత్రం మరో అయిదు నెలల్లో రిలీజ్ పెట్టుకోని చాలా కూల్ గా సలార్ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే హీరోయిన్ శృతి హాసన్ క్యారెక్టర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన సలార్ టీం, లేటెస్ట్ గా శ్రీయా రెడ్డి పాత్రకి సంబంధించిన షూటింగ్ ని కంప్లీట్ చేసారు.
పొగరు సినిమాలో నెగటివ్ రోల్ ప్లే చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్న శ్రీయా రెడ్డి ఆ తర్వాత సినిమాలని తగ్గించింది. తను రాసుకున్న క్యారెక్టర్ కోసం శ్రీయ రెడ్డిని అప్రోచ్ అయ్యి, ఆమెని ఒప్పించిన ప్రశాంత్ నీల్ కి థాంక్స్ చెప్తూ శ్రీయ రెడ్డి స్పెషల్ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్, డీఓపీ భువన్ గౌడతో దిగిన ఫోటోని పోస్ట్ చేసిన శ్రీయ రెడ్డి, సలార్ సినిమాలో తన పార్ట్ షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ని ఇచ్చింది. ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యే వరకు సలార్, ప్రాజెక్ట్ K సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకూడదు అని ప్రభాస్ కండీషన్ పెట్టడంతో అసలు ఈ సినిమాల విషయంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు శ్రీయ రెడ్డి పోస్ట్ తో సలార్ అప్డేట్ బయటకి వచ్చింది. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ అయ్యాక ప్రశాంత్ నీల్-ప్రభాస్ లు సలార్ అప్డేట్స్ తో దండయాత్ర మొదలుపెట్టబోతున్నారు.
Also Read
- Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
https://twitter.com/sriyareddy/status/1661951246675378176
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!