ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పుడు… “ది మోస్ట్ వయొలెంట్ మ్యాన్… కాల్డ్ వన్ మ్యాన్ మోస్ట్ వయొలెంట్… అతని పేరు సలార్” అంటారు అని ట్యాగ్ లైన్ తో హైప్ పెంచాడు. ఈ ట్యాగ్ లైన్ తో పాటు అనౌన్స్మెంట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసాడు ప్రశాంత్ నీల్. గన్ పట్టుకోని, కాస్త లాంగ్ హెయిర్ తో ఉన్న ప్రభాస్ పోస్టర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. సలార్ సినిమా రిలీజైన తర్వాత థియేటర్స్ కి వెళ్లిన మూవీ లవర్స్ కి ప్రభాస్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఉన్నట్లు కాకుండా వేరే లుక్ లో కనిపించాడు. టీజర్, ట్రైలర్ లో కూడా ప్రభాస్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఉన్నట్లు మీసాలు తిప్పి కనిపించలేదు. దీంతో అది కేవలం అనౌన్స్మెంట్ కోసమే చేసిన ఫోటోషూట్ అనుకున్నారు. అయితే అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఉన్న లుక్ ని ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తగా దాచాడు.
సలార్ సినిమాని థియేటర్స్ లో చూసిన వాళ్లకి మాత్రమే ఇది అర్ధం అయ్యే అవకాశం ఉంది. ప్రీఇంటర్వెల్ ఫైట్ కి ముందు… ఒక క్రైమ్ సీక్వెన్స్ బోర్డు పైన పేపర్స్ కింద ప్రభాస్ సెకండ్ లుక్ కి సంబంధించిన ఫోటో పిన్ చేసి ఉంటుంది. గాలి రావడంతో పేపర్స్ లేచి కింద ఉన్న ఫోటోని లైట్ గా రివీల్ చేస్తాయి. మళ్లీ క్లైమాక్స్ లో రోలింగ్ టైటిల్స్ పడే సమయంలో ప్రభాస్ సెకండ్ లుక్ ని రివీల్ చేసాడు ప్రశాంత్ నీల్. ఈ లుక్ సలార్ సెకండ్ పార్ట్ లో కనిపించే అవకాశం ఉంది. ఉగ్రమ్ సినిమాలో కూడా శ్రీమురళి రెండు లుక్స్ లో కనిపిస్తాడు అందులో ఒకటి ఫస్ట్ హాఫ్ లో ఇంకొకటి సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఇప్పుడు సలార్ 2 పార్ట్స్ కాబట్టి అనౌన్స్మెంట్ సమయంలో ఇచ్చిన పోస్టర్ కి సంబంధించిన లుక్ సలార్ పార్ట్ 2లో ఉంటుంది. ఈ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ పార్ట్ 2లో ఎంతటి విధ్వంసం చేస్తాడో చూడాలి.