NTV Telugu Site icon

Prasanth Varma: తీసినోడు నా కొడుకు.. ప్రౌడ్ ఫాదర్ మూమెంట్

Prasanth Varma

Prasanth Varma

Prasanth Varma: ఏ తండ్రి కైనా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వడం కంటే ఆనందం ఉండదు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను పొగుడుతూ ఉంటే.. ఆ ప్రశంసలను తండ్రికి ఎనలేని సంతోషాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తండ్రి కూడా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. హనుమాన్ సినిమాతో ప్రేక్షకులకు ఒక అద్భుతాన్ని అందించాడు. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న బడ్జెట్ తో ఎంతో మంచి విజువల్స్ ను అభిమానులకు చూపించాడు. ఇక ప్రతి ఒక్కరు ప్రశాంత్ వర్మ వర్క్ కు ఫిదా అవుతున్నారు. తన కొడుకు తీసిన అద్భుతాన్ని ప్రేక్షకులతో కలిసి చూసి.. అందరూ.. తన కొడుకును ప్రశంసిస్తుంటే తీసినోడి నా కొడుకు అని గర్వంగా చెప్పుకొచ్చాడు.

” సినిమా సూపర్.. తీసినోడు నా కొడుకు. ప్రశాంత్ వర్మ తండ్రిని నేను. సినిమా అద్భుతంగా ఉంది. ఈ చిత్రంలో నటించవారందరూ చాలా అద్భుతంగా నటించారు. నెక్స్ట్ ఏకంగా హనుమాన్ మీదనే సినిమా వస్తుంది. సినిమా చూశాక ఇలాంటి ఫీలింగ్ మొదటి సారి కలిగింది” అని చెప్పుకొచ్చాడు. కొడుకు విజయాన్ని చూసి.. ఆయన కళ్లలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. కొడుకు విజయాన్ని చూసి గర్వ పడుతున్న తండ్రి ఆనందం ఆ కళ్లలో కనిపిస్తోందంటూ నెటిజన్లు ఈ వీడియోను బాగానే వైరల్ చేస్తున్నారు.

Show comments