Site icon NTV Telugu

Pranitha Subhash: పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన పవన్ హీరోయిన్..

Pranitha

Pranitha

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. తాను పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత ఆ తరువాత వరుస అవకాశాలను అయితే అందుకున్నది కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేకపోయింది. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ సరసన నటించి మెప్పించిన ఆమె.. కరోనా లాక్ డౌన్ సమయంలో వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లాడింది. వివాహం తరువాత కూడా సినిమాల్లో నటిస్తున్న ఆమె కొన్ని రోజుల క్రితం తాను గర్భవతిని అని తీపి కబురు చెప్పింది. అప్పటినుంచి నిత్యం బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా తాను పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు అభిమానులకు చెప్పుకొచ్చింది.

“పాప పుట్టినప్పటి నుంచి అంతా కలగా అనిపిస్తోంది. గైనకాలజిస్ట్‌ అయిన తల్లి ఉండటంం నిజంగా నా అదృష్టం. కానీ మానసికంగా మాత్రం ఆమెకు ఇది చాలా కష్ట సమయం. డాక్టర్‌ సునీల్‌ ఈశ్వర్‌, అతడి టీమ్‌ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్‌ సుబ్బు, అతడి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను” అని పాపతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సెలబ్రిటీలు ప్రణీతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Exit mobile version