Site icon NTV Telugu

Prakash Raj : బాక్స్ ఆఫీస్ దగ్గర కక్ష సాధింపులు… ఏమైనా ఉంటే రాజకీయాల్లో…

Prakash Raj

Prakash Raj

టాలీవుడ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఏపీలో టికెట్ ధరలపై కొత్త జీవో వస్తుందని ఆశించిన ‘భీమ్లా నాయక్’ నిరాశే ఎదురయ్యింది. అంతేనా సినిమా విడుదల సమయంలో ఏపీ థియేటర్ల వద్ద సీఆర్ఫీఎఫ్ జవాన్లు కన్పించడంపై చర్చ జరిగింది. కానీ ఏపీ మంత్రులు మాత్రం మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా జీవో వాయిదా పడిందని, కావాలంటే జీవో వచ్చేదాకా సినిమాను వాయిదా వేసుకుని ఉండాల్సింది అంటూ సమర్థించుకుంటున్నారు. ఏదైతేనేం అన్ని సమస్యల మధ్య ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన “భీమ్లా నాయక్” బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నది. ఒకవైపు “భీమ్లా నాయక్” టీం సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంటుంటే, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం తాజాగా ఓ సంచలన ట్వీట్ చేశాడు.

Read Also : Srabanti Chatterjee : హీరోయిన్ పై కేసు… అడ్డంగా బుక్ చేసిన ముంగీస

సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏంటి ? క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నాము అంటున్నారు అంటూ ప్రకాష్ రాజ్ చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Exit mobile version