Site icon NTV Telugu

Prakash raj: కొడుకును కాపాడుకోలేని నాది ఒక బతుకేనా.. చచ్చిపోదామనుకున్నా

prakash raj

prakash raj

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏది అయినా ఆయన దిగనంత వరకే.. ఒక్కసారి ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేస్తే ప్రకాష్ రాజ్ కనిపించడు. అది ఆయన నటనలో ఉన్న గొప్పతనం. ఇక నటన పక్కన పెడితే.. సమాజంలో జరిగే తప్పులను భయపడకుండా నిలదీసే తత్త్వం ఆయనది.. ఇక పర్సనల్ గా ఆయనను వెంటాడే ఎమోషన్ ఆయన కొడుకు. మొట్టమొదటిసారి ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకొని ఎమోషనల్ అయ్యారు. ” నా మొదటి భార్య లలిత కుమారితో విభేదాలు రావడంతో విడిపోదామనుకుని.. ఇద్దరు నిర్ణయించుకున్నాకే విడాకులు తీసుకున్నాం. ఆ తరువాత ఒంటరిగా ఉండాలనుకోలేదు.. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇదే విషయాన్ని నా తల్లికి, ఇద్దరు కూతుళ్ళకి చెప్పాను. వారు కూడా ఓకే అన్నారు. అప్పుడే పోనీ వర్మను కలిశాను. ఆమె నాకన్నా చాలా చిన్నది. దాంతో ఆమె తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. మా ఇద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉందని చెప్పుకొచ్చారు.. అయినా మీ అందరు నా ఫ్యామిలీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి వారిని ఒప్పించాను. అలా మా పెళ్లి జరిగింది.

ఇక మా సంతోషానికి గుర్తుగా ఒక బాబు పుట్టాడు. ఎంతో ఆనందించాం.. అయితే అనుకోని రీతిలో అతడికి ఐదేళ్ల వయసున్నప్పుడు రిసార్ట్‌లో గాలిపటం ఎగరేస్తూ కిందపడ్డాడు. తలకు గట్టిగా దెబ్బ తగిలింది.. ఎంత ప్రయత్నించినా బాబును కాపాడలేకపోయాను. ఆ సమయంలో నాకు ప్రపంచం వద్దనిపించింది.. కొడుకును కాపాడుకోలేని నాకు.. బతకడం వేస్ట్ అనిపించింది.. చచ్చిపోదామనుకున్నా.. కానీ నా చుట్టూ ఉన్నవారి కోసం బతకాలనుకున్నా.. ఇంకో పదిమందిని బతికించాలనుకున్నా.. ఆ తరువాత నాకు మరో బాబు పుట్టాడు. ప్రస్తుతం వాడే నాకు అన్నీ.. ” అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version