Site icon NTV Telugu

Prakash Raj : బాలీవుడ్ స్టార్లు అమ్ముడుపోయారు.. ప్రకాశ్ రాజ్ సంచలనం..

Prakash Raj

Prakash Raj

Prakash Raj : బాలీవుడ్ మీద నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లోని సగం మంది అమ్ముడు పోయారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రకాశ్ రాజ్ తరచూ రాజకీయాలపై స్పందిస్తూనే ఉంటారు. ప్రతి ఘటనపై తన వాయిస్ ను సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రాజకీయాలపై మాట్లాడారు. ‘చాలా మంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలపై మాట్లాడరు. ముఖ్యంగా హిందీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, నటులు రాజకీయాలపై సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే బాలీవుడ్ లోని సగం మంది ఈ ప్రభుత్వానికి అమ్ముడు పోయారు. అందుకే సైలెంట్ గా ఉంటారు.
Read Also : Suhas : ఊరమాస్ లుక్ లో సుహాస్.. పోస్టర్ తోనే హైప్..

అందుకే దేశంలో జరుగుతున్న అనేక అవినీతి ఘటనలపై వాళ్లు వాయిస్ రైజ్ చేయరు. ప్రభుత్వం ఏదైనా సరే వ్యతిరేక చర్చలను అణచివేయాలనే చూస్తుంది. హిందీ పరిశ్రమలో చాలా మందికి మాట్లాడే ధైర్యం లేదు. నా మిత్రుడు ఒకరు నాకు ఇదే విషయాన్ని చెప్పారు. ప్రకాశ్ రాజ్ నీకు ధైర్యం ఉంది కాబట్టే నువ్వు మాట్లాడుతావు. కానీ మా పరిస్థితి అలా కాదు అన్నాడు. అలాంటి వారిని నేను అర్థం చేసుకోగలను. కానీ అందరూ సైలెంట్ అవడం క్షమించరానిది. చరిత్ర తప్పు చేసిన వారినైనా క్షమిస్తుందేమో గానీ.. తప్పును ప్రశ్నించని వారిని కాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
Read Also : NANI : హిట్ 3.. డిస్ట్రిబ్యూటర్స్ కి డేంజర్ బెల్స్..

Exit mobile version