spirit : స్పిరిట్ పోస్ట్‌పోన్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

Spirit

Spirit

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోగా, సందీప్ చేసిన తాజా వ్యాఖ్యలు అభిమానుల్లో మరిన్ని అంచనాలను పెంచాయి.

అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా సంబంధించి మాట్లాడూతూ ‘ స్పిరిట్ సినిమా షూట్ అనుకున్న విధంగానే సాగుతుంది. ప్రస్తుతానికి 40 శాతం పూర్తయింది. మిగిలిన 60 % షూట్ కూడా ఫినిష్ చేసి ఎలాంటి ఆలస్యం లేకుండా అనుకున్న సమయానికే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అవుతుందని’ సందీప్ స్పష్టం చేశారు. ఈ  సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను 2027 మార్చి 5న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ నటి త్రిప్తి డుమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ వారు సంయుక్తంగా ఈ చిత్రానికి  హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా బాలివుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ యక్ష్ణన్ ఎంట్రటైనర్ గా తెరకెక్కుస్తున్న స్పిరిట్ ఎప్పుడు వచ్చిన సరే సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.