Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగాల్సిందే. చేతినిండా భారీ ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఒకే టైంలో రెండు మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి, ఏ ఒక్క ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక తీవ్ర గందరగోళంలో పడిపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే పడవపై ప్రయాణించకుండా అటు ఇటు గెంతులు వేయడంతో ఒక్క సినిమా కూడా అనుకున్న సమయానికి థియేటర్లలోకి రాలేకపోతోంది. దీంతో ఇండస్ట్రీలో ‘పోస్ట్‌పోన్ అంటేనే ప్రభాస్ సినిమా’ అనే రీతిలో ట్రోలింగ్ మొదలైంది. ఈ ఏడాది డిసెంబర్ 3న బాక్సాఫీస్ వద్ద సందడి చేయాల్సిన హను రాఘవపూడి చిత్రం ‘ఫౌజీ’ అనుకున్నట్లుగానే వాయిదా పడింది. ‘ది ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని అధికారికంగా నిర్ధారించారు. ఫౌజీ విడుదల ఆలస్యమవుతోందన్న నిజాన్ని చెబుతూనే, అభిమానులు నిరాశ చెందకుండా ఉండేందుకు “ఇది బాహుబలి లాంటి గొప్ప సినిమా అవుతుంది” అంటూ బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. 2024 ఆగస్టులో లాంఛనంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ రెండేళ్లు గడిచినా కొలిక్కి రాలేదు. పైగా ఈ చిత్రానికి భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్ పనులు అవసరం కావడంతో, ప్రభాస్ తన భాగాన్ని ముగించినా గుమ్మడికాయ ఎప్పుడు కొడతారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ కూడా తొలుత మార్చి 5న థియేటర్లలోకి వస్తుందని ప్రచారం సాగింది. కానీ ఆ తేదీకి స్పిరిట్ వచ్చే అవకాశమే లేదని నిర్మాణ సంస్థ టీ-సిరీస్ పరోక్షంగా తేల్చేసింది. అదే మార్చి 5న తాము నిర్మిస్తున్న ‘ఖోస్లా కా ఘోస్లా 2’ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో స్పిరిట్ రేసు నుంచి తప్పుకున్నట్లేనని అర్థమైపోయింది. మరోవైపు, ఫౌజీతో పోల్చితే స్పిరిట్‌కు గ్రాఫిక్స్ పనులు చాలా తక్కువని, ఫౌజీకి కేటాయించాల్సిన డేట్లలో సగం ఇస్తే చాలు ఈ సినిమా రెడీ అవుతుందని, అందుకే స్పిరిట్టే ముందు వస్తుందన్న వార్తలూ గుప్పుమన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఫౌజీనే ముందుగా మార్చి 18న వస్తుందంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చి అభిమానులను మరింత కన్ఫ్యూజన్ లోకి నెట్టింది. మరో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కల్కి 2’ పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. దర్శకుడు నాగశ్విన్ షూటింగ్ ప్రారంభించి కమల్ హాసన్‌పై సుమారు పది రోజుల పాటు సన్నివేశాలు చిత్రీకరించినప్పటికీ, అందులో ప్రభాస్ పాల్గొన్న ఒక్క సీన్ కూడా లేదు. స్పిరిట్, ఫౌజీ పూర్తయ్యేదాకా ప్రభాస్ కల్కికి డేట్స్ కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. నవంబర్ నుంచి సాయి పల్లవి షూటింగ్లో అడుగుపెడుతుందన్న వార్తల నేపథ్యంలో, డార్లింగ్ లేని సీన్లను లాగించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్. ఇక ‘సలార్ 2’ కోసం ఎదురుచూసే అభిమానులకు నిరాశే మిగిలింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కనీసం ఇంకో ఏడాది పాటు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ పనుల్లోనే తలమునకలై ఉంటాడు. చేతిలో ఉన్న మూడు ప్రాజెక్టులు ఒక కొలిక్కి వచ్చేదాకా కొత్త సినిమా ప్రకటించకూడదని ప్రభాస్ నిర్ణయించుకున్నప్పటికీ, ప్రస్తుతం నడుస్తున్న సినిమాల్లో ఏది ముందు వస్తుందో, ఏది ఎప్పుడు వాయిదా పడుతుందో తేల్చుకోలేక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. “థియేటర్లలో బొమ్మ పడినప్పుడే సినిమా వచ్చినట్లు లెక్క” అనే నిస్సహాయ నిర్ణయానికి డార్లింగ్ ఫ్యాన్స్ రావడమే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.
Also Read
తాజావార్తలు
-
Hero Xtreme 250R Carbon: హీరో Xtreme 250R Carbon బైక్ లాంచ్.. క్రూయిజ్ కంట్రోల్, 8.5 సెకన్స్ లో 100 kmph వేగం!
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?