Prabhas : ప్రభాస్ ట్రిపుల్ బ్లాస్ట్… ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కు రాబోయే రోజులు నిజంగానే పండుగ రోజులు కానున్నాయా? ఒక సినిమా కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నుంచి, వరుసగా భారీ చిత్రాలు థియేటర్లలోకి రావడానికి రంగం సిద్ధమవుతోందా? ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఇదే చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో భారీ ప్రాజెక్టులు వచ్చినా, ఒకే ఏడాదిలో ఇంత పెద్ద స్థాయిలో వరుస విడుదలలు జరిగే అవకాశం కనిపించడం అభిమానల్లో ఉత్సాహం పెంచుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం నిజమైతే, రాబోయే కాలంలో ప్రభాస్ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ డోస్ రెట్టింపు కానుంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల జాబితా చూసినా ఆ విషయం అర్థమవుతుంది. ప్రతి సినిమా ప్రత్యేకమైన జానర్‌తో, భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయి అంచనాలతో రూపొందుతోంది. అందులో ఇప్పుడు ముందు వరసలో ‘ఫౌజీ’ ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు జరగింది. ఇప్పటికే ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉండగా, మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల గాని ఆగస్ట్ లో గాని ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
- Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. 'ది ప్యారడైజ్' పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
- Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన 'సీక్రెట్' బయటపెట్టిన చిరంజీవి!
ఇదే సమయంలో మరో భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం కూడా అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్ ప్రకటించిన నాటి నుంచే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన సందీప్, ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 2027 మార్చిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ‘స్పిరిట్’ వచ్చే ఏడాది అత్యంత భారీ విడుదలల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
ఇక ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2’ (కల్కి 2898 AD పార్ట్ 2) ను 2027 డిసెంబర్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ నేతృత్వంలో ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, సాయి పల్లవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 2027 ఏప్రిల్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ 2027 క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రభాస్ కెరీర్‌ను పరిశీలిస్తే, ‘బాహుబలి’ తర్వాత ఆయన సినిమాల విడుదలల మధ్య గ్యాప్‌లు ఎక్కువగానే కనిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు భారీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో వేగంగా ముందుకు సాగుతుండగా, మరోవైపు నిర్మాతలు రిలీజ్ తేదీలను కూడా లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకే ప్రభాస్ అభిమానులు రాబోయే రెండు సంవత్సరాలను ప్రత్యేకంగా చూస్తున్నారు.
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!