Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దాంతో పాటు ఫౌజీ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ప్రభాస్. ఆ వెంటనే స్పిరిట్ రెడీగా ఉంది. వీటి తర్వాత రెండు సీక్వెల్స్ ఉన్నాయి. కల్కి-2, సలార్-2 సినిమాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కాకుండా మరో సీక్వెల్ చేయడానికి మన డార్లింగ్ రెడీ అవుతున్నాడంట. అదేదో కాదు ది రాజాసాబ్-2. ప్రస్తుతం రాజాసబ్ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. జనవరి 9న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. కానీ అప్పటికి ఇంకా డైరెక్టర్, హీరో నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.
Read Also : Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో ఆసక్తికర విషయాలు.. వీటి వల్లే మంటలు..!
కానీ రీసెంట్ గానే మారుథి ది రాజాసాబ్-2 స్టోరీ లైన్ ను ప్రభాస్ చెప్పగా.. వెంటనే ఓకే చేశాడంట. ఈ కథ కూడా బాగానే ఉంది చేసేద్దాం డార్లింగ్ అన్నాడంట ప్రభాస్. కాకపోతే ప్రభాస్ చేతిలో ఇప్పుడు నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాతనే ది రాజాసాబ్-2 ఉంటుంది. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. డిసెంబర్ లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ రెండూ అయిపోయాక కల్కి-2, సలార్ ఉండనున్నాయి. అవన్నీ అయిపోవడానికి ఎంత లేదన్నా ఇంకో రెండు నుంచి మూడేళ్లు పడుతుంది. వీటన్నింటి తర్వాతనే ది రాజాసాబ్ ఉండనుంది. అంటే ఇంకో మూడేళ్ల దాకా ఆగాల్సిందే.
Read Also : Priyamani : “ఒకప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది: ప్రియమణి
