Site icon NTV Telugu

Prabhas: ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. సౌతిండియాలోనే ఈ అవకాశం దక్కించుకున్న తొలి హీరో

Prabhas

Prabhas

Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. దసరా ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే రావణాసుర దహన కార్యక్రమానికి నిర్వాహకులు ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రావణ దహనం చేసేందుకు ‘ఆదిపురుష్‌’లో రాముడిగా కన్పించే యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ను మించిన అతిథి మరొకరు ఉండరని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కంటే మరో హీరో పేరు కూడా తమకు ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదని వాళ్లు అంటున్నారు. నిర్వాహకుల ఆహ్వానం సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం తన జీవితంలో పెద్దదిక్కైన పెదనాన్న కృష్ణంరాజును కోల్పోయిన బాధలో ఉన్న డార్లింగ్ వచ్చే నెలలో జరిగే ఈ కార్యక్రమానికి వెళ్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read Also:God Father: ‘జై దేవ్’గా సత్యదేవ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ప్రతి ఏడాది దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఆవరణలో అత్యంత వైభవంగా దసరా పండగ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఢిల్లీ లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ ఈ వేడుకలను నిర్వహిస్తుంది. వేడుకల ముగింపురోజు నాడు రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం ఈ కమిటీ ఆనవాయితీ. గడ్డి, ఇతర వస్తువులతో తయారు చేసిన 10 తలల రావణాసురుడి భారీ విగ్రహాన్ని దగ్ధం చేయడానికి సెలబ్రిటీలను కమిటీ ఆహ్వానిస్తుంటుంది. అయితే రావణాసుర దహన కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న తొలి సౌతిండియా స్టార్ ప్రభాస్ మాత్రమే అని తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ హీరోలు అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహంలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. కాగా ఈ ఏడాది వేడుకలలో అయోధ్యలో వైభవంగా రూపుదిద్దుకుంటోన్న రామాలయాన్ని బ్యాక్‌గ్రౌండ్‌‌ సెట్స్ వేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. చెడుపై మంచి విజ‌యానికి చిహ్నంగా రావణుడి దిష్టిబొమ్మ‌ను ద‌గ్ధం చేసేందుకు ఆదిపురుష్‌లో రాముడిగా న‌టిస్తున్న ప్ర‌భాస్ కంటే మెరుగైన వారు ఎవ‌రుంటార‌ని ల‌వ్‌కుశ్ రాంలీలా క‌మిటీ చీఫ్ అర్జున్ కుమార్ పేర్కొన్నారు. అటు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.

Exit mobile version