యంగ్ రెబల్ స్టార్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు.. ఏంటీ నిజమా..? అమ్మాయి ఎవరు..? అని కంగారుపడకండి.. ప్రభాస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటే కొత్త ఇంటిని నిర్మించే ఆలోచనలో ఉన్నాడట.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కోట్లు అర్జిస్తున్న ప్రభాస్ హైదరాబాద్ లో తన కలల సౌధాన్ని నిర్మించాలని చూస్తున్నాడట. ఇప్పటికే ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొన్న ప్రభాస్.. హైదరాబాద్ లో కూడా ఒక విలాసవంతమైన విల్లాను కట్టించనున్నాడట.. దానికోసం ఇప్పటికే హైదరాబాద్ నానక్ రామ్ గుడాలో రెండు ఎకరాలను 120కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇక ఈ స్థలంలో తనకు ఇష్టమైన విధంగా, అన్ని సదుపాయాలతో ఈ విల్లాను నిర్మించుకోవాలని చూస్తున్నాడట. ఆ ఇంటి నిర్మాణం కోసం దాదాపు 80కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్.. కొద్దిగా తీరిక దొరకగానే ఇంటి ప్లాన్ మీద వర్క్ చేయనున్నాడట.. ఈ లెక్కన చూస్తే స్థలం 120 కోట్లు.. విల్లా నిర్మాణం 80 కోట్లు.. వెరసి 200 కోట్లు డార్లింగ్ ఈ ఇంటికి వెచ్చించనున్నాడు. ఎంత డబ్బు అనేది కాకుండా ప్రభాస్ తనకిష్టమైన కలల సౌధాన్ని నిర్మించుకొని పెళ్లి తరువాత అక్కడే ఉంటే అంతే చాలు అని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.
