Site icon NTV Telugu

Prabhas : ప్రభాస్ కు లైన్ క్లియర్.. రేపటి నుంచి అక్కడ షూటింగ్..

Raja Saab Prabhas

Raja Saab Prabhas

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది ఈ సినిమా. ఇంకా 20 శాతం షూటింగ్ పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు సినిమా షూట్ ను కంప్లీట్ చేయాలని మూవీ మొన్నటి వరకు షెడ్యూల్ పెట్టుకుంది. కానీ టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కారణంగా షూట్ ఆగిపోయింది. ఇప్పుడు సమ్మె ముగియడంతో షూటింగ్ మళ్లీ స్టార్ట్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతున్నాయి.

Read Also : Deepika Padukone : సీక్రెట్ గా వీడియో తీసిన వ్యక్తి.. ఫైర్ అయిన దీపిక పదుకొణె

రేప‌టి నుంచే రాజాసాబ్ షూటింగ్ మొద‌లు కాబోతోంది. ఈనెలాఖ‌రు వ‌ర‌కూ అజీజ్ న‌గ‌ర్ లో షూటింగ్ చేస్తారు. 28వ తేదీ దాకా ప్రభాస్ మీద కీలకమైన సన్నివేశాలు షూట్ చేయబోతున్నారు. సెప్టెంబ‌రు 17 నుంచి కేర‌ళ‌లో ప్ర‌భాస్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ ను షూట్ చేస్తారు. ఆ త‌ర‌వాత‌.. గ్రీస్ లో రెండు సాంగ్స్ షూట్ ఉంటుంది. ఆ పాటలతో మూవీ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. అక్టోబర్ లో వీఎఫ్‌ ఎక్స్ ఫినిషింగ్ పనులు కంప్లీట్ చేస్తారు. నవంబర్ నెలలో ప్రమోషన్లు స్టార్ట్ చేయాలని ప్లానింగ్ పెట్టుకున్నారు. ప్రభాస్ మొదటిసారి హర్రర్ సినిమాలో కనిపించడంతో మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.

Read Also : Kajol : హీరోయిన్ బాడీపై చెత్త వీడియో.. ఫైర్ అయిన నటి..

Exit mobile version